Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

జయలలిత పాత్రే నా డ్రీమ్ రోల్

Ramyakrishna-Jayalalithaaప్రముఖ రాజకీయ నాయకురాలు, గొప్ప నటి జయలలిత మరణించిన దగ్గరినుంచి వస్తున్న అనేక వార్తల్లో ఆమె జీవిత చరిత్రను సినిమాగా తీయడనేది కూడా ఒక ప్రధానమైన అంశంగా చర్చల్లో నిలుస్తోంది. కొంతమంది సినిమా ఔత్సాహికులు ఈ సినిమాలో జయలలిత పాత్రను ప్రముఖ నటి రమ్యకృష్ణ చేస్తే బాగుంటుందని… ఆమె ఆ పాత్రకు సరిపోతుందని అంటూ ఒక పోస్టర్‌ను కూడా డిజైన్ చేసి ‘మదర్’ అనే టైటిల్ పెట్టారు. ‘ది స్టోరీ ఆఫ్ ఏ క్వీన్’ అనే ట్యాగ్‌లైన్ కూడా సెట్ చేశారు. దాన్ని చూసిన సినీ అభిమానులు రమ్యకృష్ణ అయితే జయలలిత పాత్రకు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. ఈ విషయంపై రమ్యకృష్ణ స్పందిస్తూ… “ఈ పోస్టర్‌ను ఎవరో ఫ్యాన్స్ క్రియేట్ చేశారు. నాకు ఇంతకుముందు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదు. కానీ ఇప్పుడు ఉంది. ఎవరైనా మంచి స్క్రిప్ట్‌తో నా వద్దకు వస్తే జయలలిత పాత్రలో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు అదే నా డ్రీమ్ రోల్. జయలలిత ఒక శక్తివంతమైన మహిళ. నాలాంటి ఎంతో మంది ఆడవాళ్లకు ఆమె స్ఫూర్తినిచ్చారు. అలాంటి ఆమె పాత్రలో నటించడం చాలా గౌరవంగా, అదృష్టంగా భావిస్తాను. ఈ ఫాంటసీ నిజమవ్వాలని నేను కోరుకుంటున్నా”అని చెప్పింది.

Comments

comments