Home జాతీయ వార్తలు నా కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారు: స్వాతి సింగ్

నా కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారు: స్వాతి సింగ్

Swathi-singh2లక్నో: దయాశంకర్ భార్య స్వాతి మీడియాతో మాట్లాడుతూ…..తన భర్తపై కేసు నమోదు చేసినా, క్షమాపణ చెప్పిన కూడా బిఎస్‌పి అధినేత్రి మాయావతి సంతృప్తి చెందలేదని తెలిపారు. బిఎస్‌పి నేతలు తనని, తన కూతుర్ని మానసికంగా వేధిస్తున్నారన్నారు. 12 ఏళ్ల తన కూతురుని రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. తన భర్త నాలుక కోసి తెస్తే రూ.50లక్షల రివార్డు ఇస్తామనడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. తాను, తన కూతురు బయటకు వెళ్లలేక పోతున్నామని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలను మాయావతి ఎందుకు ఖండించడం లేదన్నారు. తనకు, తన కూతురికి ఎలాంటి ప్రమాదం జరిగినా బిఎస్‌పి అధినేత్రి మాయావతి బాధ్యత వహించాలన్నారు. తన కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన బిఎస్‌పి కార్యకర్తలను మాయావతి ఎందుకు సస్పెండ్ చేయలేదని స్వాతి సింగ్ డిమాండ్ చేశారు.