Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

నా భర్తను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలి

My husband should be taken back to work

కలెక్టరేట్ ఎదుట కొడిమ్యాల
ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ భార్య నిరసన

మనతెలంగాణ/జగిత్యాల: తన భర్తను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కొడిమ్యాల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌గా వ్యవహరించి ఎస్‌ఎస్‌సి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలతో సస్పెండ్ అయి న బత్తిని సత్యనారాయణ భార్య స్వర్ణలత తన కు టుంబ సభ్యులతో వచ్చి గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ, గత ఎస్‌ఎస్‌సి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌గా వ్యవహరించిన తన భర్త బత్తిని సత్యనారాయణగౌడ్ తో పాటు ఎంఇఓ వెంకటేశ్వర్లు, కోనాపూర్ హైస్కూల్‌లో గణితం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న వడ్లకొ ండ రమేశ్, రాంసాగర్ హైస్కూల్ గణితం ఉపాధ్యాయుడు శ్రీనివాస్, కెజిబివి స్పెషల్ అఫీసర్ మంద లి ంగవ్వ,ఉపాధ్యాయురాలు పద్మ,కోనాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణరావు, సిఆర్‌పి చంద్రమోహన్‌లను బాధ్యులుగా పేర్కొంటూ జిల్లా వి ద్యాశాఖాధికారి సస్పెండ్ చేశారని, అయితే తన భర్తను తప్పా మిగతా అందరినీ విధుల్లోకి తీసుకుని త న భర్తను మాత్రం విధుల్లోకి తీసుకోవడం లేదన్నారు. తన భర్తను విధుల్లోకి తీసుకోవాలంటే సస్పెన్షన్ రద్దు చేయాలని కోరుతూ స్టేట్‌ఆఫీస్‌కు ఫైల్‌ను పంపించాలంటే ఖర్చవుతుందంటూ కొడిమ్యాలలో ఎంఇఓగా పనిచేసిన వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయుడు తిరుమల్‌లు మా ఇంటికి వచ్చి రూ.2 లక్షలు తీసుకున్నారని తెలిపింది.అయినా ఫైల్‌ను పంపించకుండా తమ కుటుంబాన్ని మానసింకంగా వేధింపులకు గురి చేశార ని, ఉద్యోగం కావాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని, అప్పుడే మీ ఫైల్‌ను డిఇఓ స్టేట్ ఆఫీస్‌కు పంపిస్తారని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త తో పాటు సస్పెండ్ అయిన వారిని విధుల్లోకి తీసుకు ని తన భర్తను మాత్రం విధుల్లోకి తీసుకోకుండా అన్యాయం చేస్తున్నారని స్వర్ణలత కన్నీటి పర్యంతమైంది. తన భర్తను విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినా జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు కావాలనే తన భర్తను వేధింపులకు గురి చేస్తున్నారని,డిఇఓ వేధింపులు భరించలేక ఇంట్లోంచి వె ళ్లిన పోయిన తన భర్త గత వారం రోజుల నుంచి ఆ చూకీ లేకుండా పోయాడని వాపోయింది. ఎలాంటి తప్పిదం చేయని తన భర్తను ఉద్యోగంలోకి తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని స్వర్ణలత వేడుకుంది.

Comments

comments