Search
Sunday 18 November 2018
  • :
  • :

నా లోపలి కవిత

POEM

పొద్దున్నేపక్షుల కిలకిలారావాలతో
నాలోపలి కవిత కళ్లు తెరుస్తుంది
ఇల్లూ వాకిలి ఊడ్చి
టీ మరగబెడుతుంటే
కవిత్వానికి కొత్త ఉత్సాహం!
పిల్లలకు టిఫిన్లు పెట్టి
పతిదేవుణ్ణి ఆఫీసుకు పంపిస్తూ
చెయ్యి ఊపుతున్నపుడు
నా మదిలోపలి కవితకు
తను విముక్తి పొందుతున్నానన్న ఊపు,
ఏది అన్నంతా కుతకుత ఉడికినా
కూరతో ఘుమఘుమలాడుతుంది
చల్లని పెరుగుతో నా కడుపు నిండగానే
నా లోపలి కవితకు మళ్లీ కొత్త ఉత్సాహం
పెన్ను పట్టుకోగానే కాలేజ్ టైము
పట్టుకున్న పెన్నుని కాయితంతో పాటే
పర్సులోనికి దూరుస్తాను
కవిత లోపల్లోపలఊపిరాడక తల్లడిల్లుతుంది

పిల్లలక పాఠాలతో మౌనముద్ర
దాలుస్తుంది
తిరుగు ప్రయాణంలో బస్సు రద్దీలో
కవిత పత్తాలేకుండా పోతుంది

మళ్ళీ యిల్లు చేరి టీలూ గట్రాట చేసి
వంటా తంటా తిండి తిప్పలూ ముగించి
కవిత కోసం వెతుకుతూంటే –
భర్తగారి చెరలాట
మెల్లగా ముద్దులిచ్చి
ముసుగులోకి చేర్చుకోగానే
కవిత కన్నీళ్లు పెట్టుకుంటుంది.
విసిగి వేసారి దిగంబరమైపోతుంది
ఓడిపోయి ఒళ్లు హూణమై
కారు చీకట్లో కలిసి చచ్చిపోతుంది
అలా చివరక్కూడా కళ్లు తెరవని కవిత్వాన్ని
ఎప్పుడు ఎక్కడ రాయను? ఎలా ఎక్కడ చదవను?

(హిందీ : అనామిక
అనువాదం : డా॥ నలిమెల భాస్కర్ ,
సెల్ : 9704374081

 

Comments

comments