Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

నా కొడుకు పవర్ స్టార్ లా ఉండాలనుకోను…!

renuuనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెండో మాజీ భార్య రేణుదేశాయ్ అదిరిపోయే ట్వీట్ చేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి పవన్ ఎక్కువగా బయట చెప్పుకోవడం మనం చూడలేదు. అలాగని ఆయన వివాహ జీవితం అంతగొప్పది కూడా కాదు అని అభిమానులూ పెద్దగా పట్టించుకోరు. అయితే పవన్ వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలని మాత్రం తన అభిమానులకు ఆస్తి ఉంటుంది. తన రెండో మాజీ భార్య రేణుదేశ్ మాత్రం పలు సామాజిక మీడియాల్లో అప్పుడప్పుడూ పవన్ గురించి ప్రస్తావన తీసుకొస్తూ మీడిమా దృష్టికి వస్తుండటం చూస్తున్నాం. రేణు ఏది చేస్తే అది తప్పకుండా సంచలనం కలిగిస్తుంది.
తన కుమారుడు అకీరా శనివారం 13 పుట్టినరోజు సందర్భంగా రేణుదేశాయ్ శుభాకాంక్షలు తెలియజేసింది. ఆమె చేసిన ట్వీట్ కాస్త పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగాను, పరోక్షంగాను ఇబ్బంది కలిగించేదిగా వుంది.
తన కుమారుడు అకీరానంద జూనియర్ పవన్ కుమార్ కాకుండా తన సొంత కాళ్లపై ఎదగాలని, అకీరా నందగానే ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. తల్లిదంద్రులపై ఆధారపడకుండా తనకంటూ సమాజంలో ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, పవర్ స్టార్ గా కాకుండా అకీరానందగానే పేరు తెచ్చుకుంటాడన్న నమ్మకం ఉంది. మై స్వీట్ హార్ట్ అకీరాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ రేణు ట్వీట్టర్లో పోస్టు చేశారు. అప్పుడే నా స్వీట్ హార్ట్ కు 13 ఏళ్లు వచ్చేశాయా అని ఆలోచిస్తుంటే పుట్టే భావొద్వేగాల్లో నాకు మాటలు రావడంలేదని అన్నారు రేణుదేశాయ్.

Comments

comments