Home అంతర్జాతీయ వార్తలు సముద్రంలో కూలిన మయన్మార్ సైనిక విమానం

సముద్రంలో కూలిన మయన్మార్ సైనిక విమానం

116 మంది గల్లంతు, శకలాల గుర్తింపు

planeయాంగ్యాన్ : వంద మంది సైనికులతో ఉన్న మయన్మార్ సైనిక విమానం బుధ వారం మార్గమధ్యలో గల్లంతయింది. మెయిక్ నగరం నుంచి యాంగ్యాన్‌కు ప్రయాణిస్తుండగా దుర్ఘటన జరిగింది. తరువాత జరిగిన గాలింపు చర్యలలో విమానశకలాలను అండమాన్ సముద్రంలో కనుగొన్నారని స్థానిక అధికారులు తెలి పారు. విమానంలో వంద మంది ప్రయాణికులు వారి కుటుంబ సభ్యులు, డజన్‌కు పైగా పిల్లలు కూడా ఉన్నారు. విమానం కన్పించకుండా పోవడం, శకలాలు సముద్రం లో లభ్యం కావడంతో ఇందులోని వారంతా దుర్మరణం చెందినట్లుగా నిర్ధారణ అవు తోంది. అయితే మృతదేహాలను కనుగొనకపోవడంతోదీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఉన్నట్లుండి ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థతో విమానానికి సంబంధాలు లేకుండా పోవడంతో ప్రమాదం జరిగినట్లుగా గుర్తించి గాలింపు బృందాలు రంగంలోకి దిగాయి. నావిక దళం, వైమానిక దళం రంగంలోకి దిగింది. ప్రయాణ సమయంలో విమానంలో మొత్తం 116 మంది వరకూ ఉన్నట్లు వెల్లడైంది. దావెయి నగరానికి 218 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో శకలాలను గుర్తించారని అధికారులు తెలిపారు. ఇంకా నౌకాదళ సిబ్బంది గాలింపు చర్యలు సాగిస్తున్నారు. విమానంలో ఎంత మంది ఉన్నారు? అనే అంశంపై పలు విధాలుగా గందరగోళం నెలకొంది. దీనిపై నిర్థారణకు రాలేకపోతున్నట్లు తెలిసింది.