Home ఆఫ్ బీట్ ఆకాశం నుంచి ఊడి పడ్డ వింత వస్తువు

ఆకాశం నుంచి ఊడి పడ్డ వింత వస్తువు

Strange-Thing1

చెన్నై: వింత ఆకారం ఉన్న వస్తువు ఆకాశం నుంచి వ్యవసాయ పొలంలో పడింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కరూర్ జిల్లా గౌండపాళయంలో జరిగింది. వింత వస్తువు భారీ శబ్ధంతో పడడంతో పరిసరాల్లో ఉన్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు బాంబ్ స్కాడ్‌తో అక్కడికి చేరుకొని దానిని పరిశీలిస్తున్నారు. ఈ వస్తువు గుండ్రటి ఇనుప రేకులా ఉందని పోలీసులు తెలిపారు. జెడ్ ప్లేన్ నుంచి పడిన ఏదైనా వస్తువు కావొచ్చని చెప్పారు.