Home ఆఫ్ బీట్ వాలంటైన్స్ డే చరిత్ర

వాలంటైన్స్ డే చరిత్ర

Valentaince-day

ఒకప్పుడు రోమ్‌కి చక్రవర్తిగా క్లాడియస్ట్ అనే రాజు ఉండేవాడు. ఆ రోజుల్లో తన దేశానికి రక్షణగా సైనికులను ఎక్కువగా నియమించేవాడు. కాకపోతే సైనికులెవరూ పెళ్లిచేసుకోకూడదని ఓ చట్టాన్ని పెట్టాడు. దీంతో చాలా మందికి ఈ రూల్ నచ్చలేదు. జీవితంలో పెళ్లి కూడా ముఖ్యమనే ఆలోచనలో ఉన్న యువత మనసులో చాలా మధనపడేవారు. అప్పటికే తమకు ప్రేయసి ఉన్నవారు రాజును ఎదిరించే ధైర్యంలేక సతమతమయ్యేవారు. అదే దేశంలో సెయింట్ వాలెంటైన్‌గా పిలువబడే ఒక పాస్టర్ ఒక చర్చిలో సెయింట్‌గా ఉండేవాడు. అతను మాత్రం ఈ కొత్త రూల్‌ని మొదట్నించీ వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. ఎవరైతే సైన్యంలో చేరారో, వారికి వారు ప్రేమించిన అమ్మాయిలతో రహస్యంగా పెళ్లిళ్లు చేస్తుండేవాడు. ఈ విధంగా ఆ రోజుల్లో రాజుకు వ్యతిరేకంగా ప్రేమించుకునే యువతీయువకులకు దగ్గరుండి మరీ వివాహం జరిపించేవాడు. ఆ విషయం తెలుసుకున్న రాజు వాలంటైన్‌ను అరెస్ట్ చేయించి ఉరిశిక్ష విధించాడు. ఇలా సెయింట్ వాలంటైన్ జైలులో చాలారోజులున్నాడు. ఈ క్రమంలో జైలు అధికారి కూతురు ప్రతిరోజూ వాలంటైన్‌ను కలిసేది. ఆమె అంధురాలు. అయినా వాలంటైన్ ఎంతో మహిమతో ఆమె గుడ్డితనాన్ని పోగొట్టాడు. ఈ విధంగా ఆమె వాలంటైన్‌కి అభిమానిగా మారింది. కొన్ని రోజులకు అతనికి ఉరిశిక్ష విధించారు. ఆ ఉరిశిక్ష అమలు చేయడానికి ముందురోజు వాలంటైన్ జైలు అధికారి కూతురుకు ఆఖరి ఉత్తరం రాస్తూ, దాని కింద ఫ్రం యువర్ వాలంటైన్ అని సంతకం పెట్టాడు. ఆ తర్వాత మరణశిక్ష అమలయింది. ఫిబ్రవరి 14న ప్లామ్లియాలో వాలంటైన్‌ను సమాధి చేసినట్లు కొన్ని ఆధారాలున్నాయి. ఈ విధంగా రోమ్ చక్రవర్తికి వ్యతిరేకంగా ఎంతోమందికి ప్రేమ వివాహాలు జరిపించిన సెయింట్ వాలంటైన్‌ను అందరికీ అభిమానపాత్రుడయ్యాడు. ఫిబ్రవరి 14న అతని పేరుమీద వాలంటైన్‌డేగా జరుపుకోవడం మొదలుపెట్టారు. మిగతా దేశాలు కూడా దీన్ని ఆచరించడం మొదలుపెట్టాయి. 1537లో ఇంగ్లండు రాజైన కింగ్ హెన్రీ 7 అఫీషియల్‌గా ఫిబ్రవరి 14ని వాలంటైన్స్‌డేగా ప్రకటిస్తూ ఆ రోజు ఇంగ్లండుని హాలిడేగా ప్రకటించాడట.

ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు వాలంటైన్స్ వీక్‌ను జరుపుకుంటారు.  

-రోజ్ డేతో మొదలవుతుంది. ప్రతి ఒక్కరికీ పువ్వులంటే ఇష్టం ఉంటుంది. గులాబీతో ప్రేయసికి ప్రపోజ్ చేయడం థ్రిల్లింగ్‌గా ఫీలవుతుంటారు అబ్బాయిలు.
– ప్రపోజ్ డేగా సెకండ్ డే చేసుకుంటారు.
– చాక్లెట్ డే..ప్రేమికులు తమ ప్రేయసి లేక ప్రియునికి చాక్లెట్‌తో ప్రేమను వ్యక్త పరుస్తుంటారు. మంచి మూడ్‌ను కలిగించేవి చాక్లెట్స్.
– టెడ్డీబేర్ డే…ఆడపిల్లలకు టెడ్డీబేర్‌లతో బాల్యం నుంచి అనుబంధం ఉంటుంది. ఇవి బాల్యం తాలూకు గుర్తులు. అందుకనే వారి కిష్టమైన టెడ్డీలను ఇచ్చి మనసు దోచుకునేందుకు ప్రయత్నిస్తారు అబ్బాయిలు.
– ప్రామిస్ డే…ప్రేమంటే బాధ్యత. ప్రమాణాలు చేసుకునేది. కమిట్‌మెంట్‌తో కూడుకుందని నమ్ముతుంటారు. అందుకే ఈ రోజును పాట్నర్‌కు కమిట్‌మెంట్‌ను తెలిపే రోజుగా జరుపుకుంటారు. ఈ రోజు బంధాన్ని నిలబెడు తుందంటారు.
– హగ్ డే…ఇష్టమైన వాళ్ల స్పర్శ మధురానుభూతిని కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కౌగిలింతలోని ఆనందం మరెందులోనూ లేదంటారు. ప్రేమ, అభిమానం,నీకు నేనున్నాను అనే భరోసాలను కలిగించేది హగ్గింగ్.
-కిస్ డే… వాలంటైన్స్ డేలో మరో అందమైన రోజు కిస్సింగ్ డే. ముద్దు పెట్టుకోవడం ద్వారా తమ ప్రేమను వ్యక్తం పరుస్తారు ప్రేమికులు. ముద్దు ప్రేమకు సంకేతంగా భావిస్తారు. ఎప్పుడూ పెదవులనే కిస్ చేయాలనే రూలేం లేదు..నుదుటిపై కూడా పెట్టుకోవచ్చు.
-ఇక చివరిగా వాలంటైన్స్ డే…ఎంత కాలం నుంచి దాచుకున్న తమలోని ప్రేమను వ్యక్తపరచే అందమైన రోజుగా వేడుక చేసుకుంటారు. ఎక్కడ చూసినా ప్రేమపక్షులే కనిపిస్తాయి. ఎవర్ని ఎవరు ఎలా ప్రేమిస్తున్నారు.. ఎంత ప్రేమిస్తున్నారనే విషయం వారి వారి పరిధిలో తెలుపుతుంటారు.