Home వార్తలు అలల అడుగున

అలల అడుగున

‘సముద్రం అంటే అఖాతం. అంతుపట్టని మిస్టరీ. లోతుకి వెళ్తున్న కొద్దీ ఆశ్చర్య పరిచే అద్భుత లోకం.  కనీవినీ ఎరగని వింత ప్రాణులు. నిధులు, మణులు, మాణిక్యాలు…ఉన్నాయో లేవో అన్న ఊగిసలాటలు, కొన్ని ఆధారాలు దొరికితే చాలు ఆ అద్భుతాన్ని ఛేదించవచ్చు అన్న వెతుకులాట. ఎన్నో రహస్యాలను పొట్టలో దాచుకున్న గని సముద్రం. బెర్ముడా ట్రయాంగిల్‌లో ఏముంది? అట్లాంటిస్‌లో కనిపించకుండా పోయిన నగరం ఎక్కడుంది? పాల సముద్రం ఎక్కడ?  ఏమా కథ.. అనే వివరాల్లోకి వెళ్లారు పరిశోధకులు. 

seaదేవీపుత్రుడు సినిమాలో ద్వాపర యుగం సముద్ర గర్భంలో ఉందని దాన్ని jకనిపెట్టాలన్న కథాంశం చుట్టూ సినిమా తిరుగుతుంది. సముద్రంలో ఏముందో తెలుసుకోవాలని సైంటిస్టుల 20 వ శతాబ్దం మద్య నుంచే అధ్యయనాలు ఊపందుకున్నాయి. చంద్రుడి మీద జరిగినన్ని అధ్యయనాలు సముద్రం లోతుల్లో జరగలేదని చర్చలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 2-5 శాతం సముద్రపు లోతునే చూడగలిగారు. ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
ఇండియన్ ఓషన్
భారతదేశం చుట్టుపక్కల ఉన్న సముద్రం, ఇండియన్ ఓషన్. దేశపు పశ్చి కోస్తా ప్రాంతంలో అరేబియన్ సముద్రం ఉంటుంది. తూర్పు కోస్తా ప్రాంతంలో బంగాళాఖాతం ఉంటుంది. భూమ్మీద ఉన్న సముద్రాలలో మూడవ అతి పెద్దది, వెచ్చనైనది ఇండియన్ ఓషన్. భూమ్మీద ఉన్న నీటిలో 20 శాతం ఇందులోనే ఉంది. నీటి ఘనపరిమాణం దాదాపు 28.35 మిలియన్ చదరపు మైళ్లు. ఇండియన్ ఓషన్ మీద ఉత్తర ప్రాంతంలో వానాకాలం ప్రభావం చూపుతుంది. దానివల్లనే బంగాళఖాతంలో, అరేబియన్ సముద్రంలో తుఫాన్లు, పెద్ద ఎత్తున గాలివానలు, రావడానికి కారణం అవుతుంది.
ద సదరన్ ఓషన్
అంటార్కిటికాను పెద్ద ఐసుముక్క అని అంటారు. అయినా భౌగోళికంగా దీనికి పెద్ద ప్రాముఖ్యత లేదు. ఈ సముద్రం వెళ్లి భూమిని తాకదు. డైరెక్ట్‌గా వెళ్లి ఇంకో సముద్రాన్ని తాకుతుంది. దాంతో ఇది ఎక్కడ మొదలు, ఎక్కడ ముగిసిందనే అనుమానం వస్తుంది. అప్రమత్తంగా లేకపోతే ఈ సముద్రం చంపేస్తుంది. ఈ సముద్రం గుండా ప్రయాణిచే షిప్‌లు, నిరంతరం క్రూరంగా ఉండే వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏడాదిలో ఏ సమయంలో అయినా ఐస్‌బర్గ్‌లు ఏర్పడటం చాలా సాధారణం. ఒకవేళ షిప్‌లకు ఈ ఐస్‌బర్గ్‌ల వలన పెద్దగా డ్యామేజ్ అయిందా ఇంక ఆట ముగిసినట్టే. అలా మునిగిన ఓడలను వెతకడానికి రక్షణ మిషన్లను వెదకడానికి పంపండం అసాధ్యం. ఓడను నడిపేవారు మూడు ప్రమాదకరమైన ప్రదేశాలను కనిపెట్టారు. దాని ఆధారంగా సముద్రాన్ని దాటుతుంటారు.

ఫైర్ కోరల్
దీన్ని చూడచ్చు. కాని ముట్టుకోకూడదు. అందుకే స్కూబా డైవర్లు గ్లోవ్స్ వాడతారు. జెల్లీఫిష్ లాగా ఉంటుంది. వీటికి పవర్ స్టింగ్స్ ఉంటాయి. అవి తగిలితే త్రీవ్రమైన నొప్పి, కొన్నిసార్లు వాంతులు, తలతిరుగుడు ఏర్పడతాయి.

సముద్ర గర్భంలో పర్వత శ్రేణులు
wave3భూమ్మీద సముద్రాలు అంతుపట్టని అందమైన ఖనులు. కాని నిజానికి మనకి సముద్రం గురించి ఎంత తెలుసు? వాటి లోపల ఎవరికీ తెలీని అద్భుత ప్రపంచం ఉంది. ఆ ప్రపంచాన్ని ఛేదించడానికి స్కూబా డైవర్లు, ఓషనోగ్రాఫర్లు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. భూమ్మీద 70 శాతం సముద్రాలే ఉన్నాయి. భూమ్మీద 94 శాతం జీవితం జలమయం. అందుకే భూమ్మీద జీవిస్తున్న మనం మైనారిటీలమే. సముద్రాల సరాసరి లోతు 12,400 అడుగులు. అయితే కాంతి, నీటి ఉపరితలం మీద 330 అడుగుల కంటే ఎక్కువ లోతుకి వెళ్లలేదు. మిగిలిన ప్లానెట్ అంతా చీకటిమయమే. అమెరికాలో చాలా భాగం సముద్రపు అడుగునే ఉంది. అలానే ఎంతో భూభాగం సముద్ర నిక్షిప్తమై ఉంది. ప్రపంచంలో కెల్లా అతి పెద్ద పర్వత శ్రేణులన్నీ సముద్రలోనే ఉన్నాయి. దాఇన్న మిడ్ ఓషన్ రిడ్జి అంటారు. అట్లాంటిక్ సముద్రం మధ్య నుంచి ప్రవహించడం మొదలుపెట్టి ఇండియన్ సముద్రం, ఇంకా పసిఫిక్ సముద్రాల్లోకి 35,000 మైళ్ల పొడవున ఈ శ్రేణులుంటాయి.
తేలాల్సిన లెక్క చాలానే ఉంది
సముద్రపు లోతుల్లో ఉండే మ్యూజియం ప్రపంచంలోకెల్లా అతి పెద్దది. అంతు పట్టని అద్భుత విశేషాలతో ఎన్ని వేల సంవత్సరాలు వెతికినా పూర్తి కాదు. ఎంత చూసినా తరగదు. ఇప్పటి వరకు భూమ్మీద కేవలం 5 శాతం సముద్రాలను గురించి మాత్రమే కనుక్కున్నాం. ఇంకా 95 శాతం సముద్రాలకు సంబంధించిన సమాచారం లేదు. మన దగ్గర మార్స్ గురించిన మ్యాప్‌లు స్పష్టంగా ఉన్నాయి కాని భూమ్మీద ఉన్న సముద్రాల గురించి సరిగా తెలీదు. మరింత పరిశోధన ప్రపంచ వ్యాప్తంగా జరగాల్సి ఉంది.
సముద్రపు లోతుల్లో ప్రాచీన నాగరికతలు, ఆసక్తికర విషయాలు, అంతుపట్టని అద్భుతాలు, ఆశ్చర్యకరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఆ వింతలు, మిస్టరీల్లో ఇవి కొన్ని మచ్చుకి.

స్టోన్‌ఫిష్
చూడటానికి విచిత్రంగా ఉండే చేప ఇది. రాళ్ల వెనక, నీటి అడుగున దాక్కుంటూ ఉంటుంది. దానికున్న డోర్సల్ మొప్పలు ఎంత షార్ప్‌గా ఉంటాయంటే, గట్టిగా ఉన్న బూటులోకి కూడా దిగబడిపోతాయి.

బీమిని రోడ్
sea3బహామాల దగ్గరలో బండరాళ్లతో కూర్చిన ఒక నిర్మాణం బయటపడింది. దశాబ్దాల తరబడి స్థానిక నివాసితులు, సైంటిస్టులు, తత్వవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు చేసిన అన్వేషణలో అది బయట పడింది. అది అట్లాంటిస్ ఖండంలోని మానవ నిర్మిత పురాతన నిర్మాణంగా నమ్ముతున్నారు. అసలు ఈ రోడ్డు ఎందుకుందో ఎవరికీ తెలీదు. అరమైలు వెడల్పు, 13 అడుగుల ఎత్తు ఉంది ఆ రోడ్డు. మనుషులు పాలిష్ చేసినట్టు నున్నటి ఉపరితలం ఉంది. కాలం గడిచేకొద్దీ ఈ రాళ్ల రోడ్డు మరిన్ని వింతలకు దారి తీసింది. 1979 లో ఇద్దరు అమెరికన్లకు ఆ రాళ్ల మీద నీళ్లలో ఒక మెరుస్తున్న త్రికోణాకారపు వస్తువు కనిపించింది. అది అట్టడుగు నుంచి కదులుతూ వస్తోంది. నీళ్లలోంచి పుట్టిన ఆ త్రికోణాకారం పైకెగిరి ఆకాశంలోకి మాయం అయిపోయింది. ఇంకో అతను( డైవర్) పది అడుగుల మనిషి డైవింగ్ సూట్ లేకుండానే నీటి అడుగు నుంచి వస్తుంటే చూశాడట. ఈ ప్రాంతాన్ని పరిశోధించడం మరింత కష్టం. నీటిలో ప్రవాహాల కింద పెద్ద సంఖ్యలో తెల్ల షార్క్‌లుంటాయి. 2004 లో ఒక అమెరికన్, ఒక పొరగా కొన్ని రాళ్ల బ్లాక్‌లు ఉన్నాయని కనుక్కున్నాడు. ఇంకా అడుక్కి, అలా మూడు స్థాయిలున్నాయి. మొత్తానికి డైవర్లు/ఈతగాళ్లు కనుక్కున్నదాని ప్రకారం అది కేవలం రోడ్డు కాదని, పురాతన కట్టడాల పైభాగం అని తేలింది.

రెడ్ టైడ్
రెడ్ టైడ్‌ని సాంకేతికంగా అల్గాల్ బూమింగ్ అంటారు. సముద్రపు నీటిలో శైలీంధ్రాలు పెద్ద స్థాయిలో పెరిగినప్పుడు సముద్రంలో ఒక ప్రత్యేకమైన ప్రక్రియ జరుగుతుంది. సముద్రంలో రెడ్ టైడ్ ఉంటే అది అటు వెళ్లిన మనుషులు, పక్షులు, జంతువులకు ప్రమాదమే.

పాల సముద్రం కథ
పాల సముద్రం అంటే నిజంగా పాల లాటి రంగుతో నీరుండే ఇండియన్ ఓషన్. దానికి కారణం బయోల్యుమినిసెంట్ బ్యాక్టీరియా చర్యల వలన నీరు నీలిరంగులోకి మారుతుంది. అదే చీకట్లో కళ్లకు పాల వంటి రంగుతో కనిపిస్తుంది. చాలా ఏళ్లుగా సైంటిస్టులు, సముద్రాల్లో అద్భుతమైన సహజ అందాలను వెలికితీయడానికి ప్రయత్నిస్తున్నారు. పాల సముద్రాలు ఎలా ఏర్పడ్డాయో అనే ఉత్సుకత ఉంది. ఒక ఓడ పాల సముద్రాన్ని ఢీ కొట్టింది. అందుకే ఆరు గంటల వరకు కదలలేకపోయిందని కెప్టెన్ చెప్పాడు. పాల సముద్రం గురించి సైన్సుకి చాలా విషయాలు తెలిసినప్పటికీ సైంటిస్టులు ఇప్పటికీ ఈ మిస్టరీని ఛేదించలేకపోయారు. అమెరికాలో స్టీవ్ మిల్లర్ అనే సైంటిస్టు, సముద్రంలోని చాలా ప్రాంతాల్లో ల్యుమినిసెంట్ బ్యాక్టీరియా విబ్రియో హార్వేయి వలన ఎక్కువకాలం ప్రకాశవంతంగా ఉన్న ప్రదేశాలున్నాయని అంటారు. కాని ఇంకా ఇది ఒక అంచనాగానే ఉంది. పూర్తి వాస్తవం కాదు.
యోనగుని పిరమిడ్స్
జపాన్‌లో యోనగుని ద్వీపాన్ని గుర్తించారు. 80ల మధ్య కాలంలో యోనగుని బాగా ప్రాముఖ్యత పొందింది. సముద్రపు లోతుల్లో పదునైన కోణాలతో ఉన్న వింతైన రాళ్ల పిరమిడ్‌ను కనుక్కున్నారు డైవర్లు. చాలా ఏళ్ల కిందట పేరు తెలియని నాగరికత నుంచి వచ్చిన రాతి పిరమిడ్ అది. అది దానంతట అదే ఏర్పడిందా లేక మనుషులు తయారు చేసిందా అనేది చర్చలో ఉంది. 600 అడుగుల పెద్దది, 90 అడుగుల ఎత్తు ఉంది. గత 15 ఏళ్లుగా నీటి అడుగున పిరమిడ్ల మీద అధ్యయనం చేస్తున్నారు జపాన్ యూనివర్శిటీ జియాలజిస్ట్‌లు. అవి దాదాపు 5 వేల ఏళ్ల కిందటి పిరమిడ్లని, 2000 ఏళ్ల కిందట వచ్చిన భూకంపంలో సముద్రంలోకి దిగిపోయాయని తేల్చారు.
సముద్రంలో వాటర్ ఫాల్స్
జలపాతాలు కేవలం భూమి మీదే ఉండవు. సముద్రపు లోతుల్లో కూడా ఉంటాయి. సముద్రంలో ఏడు జలపాతాలు కనుక్కున్నారు. డెన్మార్క్ స్ట్రెయిట్‌లో ఎక్కడైతే గ్రీన్‌ల్యాండ్, ఐస్‌ల్యాండ్ విడిపోయే దగ్గర అతి పెద్ద జలపాతాలున్నాయి. 175 మిలియన్ క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు నుంచి జాలువారుతాయి. భూమ్మీద అతి పెద్ద జలపాతాలుగా పేరు గన్న బ్రెజిల్ పరాగ్వే సరిహద్దుల్లో ఉన్న జలపాతాల కన్నా 350 రెట్లు పెద్దవి.

బ్రినికిల్
సముద్రంలో ధృవాల చుట్టూతా ప్రాంతంలో ఒక పొగ లాగా ఉప్పు పైకి లేస్తుంటుంది. సముద్రపు ఉపరితలం మీద నుంచి నీటి అట్టడుగు నుంచి ఘనీభవించిన ఉప్పు గడ్డ కట్టిన ఐస్ రూపంలో పైకి పోతుంటుంది. ఘనీభవించిన ఉప్పు నీటి అడుక్కి వెళ్లి గట్టిపడి అది ఘనీభవించిన ఉప్పుగా పైకెగుస్తుంది.

బాల్టిక్ సీ అనామలీ
2011 లో బాల్టిక్ సీ అనామలీని డైవర్స్ కనుక్కున్నారు. బాల్టిక్ సముద్రంలో 90 మీటర్ల లోతున అరవై మీటర్ల మందం ఉన్న ఒక గుండ్రటి వస్తువును కనుక్కున్నారు. 300 మీటర్ల పెద్దది. సైంటిస్టులు దాని మీద చాలా పరిశోదనలు చేశారు కాని అదేంటనేది ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీనే.
క్రాప్ సర్కిల్
wave2ఈమధ్యనే ఒక జపాన్ ఫొటోగ్రాఫర్, డైవర్ సముద్రపు అట్టడుగున, ఒడ్డుకి అతి దగ్గరలో ఒక నమూనాను కనుక్కున్నారు. వెంటనే చానల్స్ వారిని, మరికొంతమంది సాక్షులను పిలిచి ఆ వింత ప్రదేశాన్ని రికార్డు చేయించారు. కేకు ఆకారంలో, ఎవరో తయారు చేసినట్టే ఉన్న ఇసుక ఏర్పాటు. అయితే ఈ మిస్టరీని మన ఆధునిక సాంకేతికత కనిపెట్టింది. ఆ సర్కిల్ డిజైన్‌ని గీసింది పఫర్ చేప. మగ పఫర్ చేప, ఆడ చేపలను ఆకర్షించడానికి తన మొప్పలతో అటువంటి ఆకారాన్ని సృష్టిస్తుందట.
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద వర్ల్‌పూల్(బెర్ముడా ట్రయాంగి వర్ల్‌పూల్)
బెర్ముడా ట్రయాంగిల్‌లో చాలా బోట్లు మిస్ అయ్యాయి. ఫ్లోరిడా, పూర్టో రికో, ఇంకా బెర్ముడా ప్రాంతాల్లో సముద్రంలోని ఒక త్రికోణాకారంలో ఉన్న అతి పెద్ద ప్రాంతం బెర్ముడా ట్రయాంగిల్. చాలా శతాబ్దాలుగా డజన్ల కొద్దీ షిప్పులు, విమానాలు ఈ ప్రాంతంలో మాయం అయిపోయాయి. అందుకే ఈ మిస్టీరియస్ ప్రాంతాన్ని ‘ద డెవిల్స్ ట్రయాంగిల్ ’అంటారు. బెర్ముడా ట్రయాంగిల్‌కి చెడ్డ పేరు క్రిస్టోఫర్ కొలంబస్ నుంచి ఆరంభం అయింది. 1492 లో అక్టోబర్ 8వ తేదీన కొలంబస్ తన కంపాస్‌లో చూసుకుంటే ఆ ప్రాంతంలో చూపించే రీడింగ్స్ వింతగా ఉన్నాయట. అక్కడ ఒక వింతైన కాంతిని గమనించాడు అతను. అప్రమత్తంగా లేకపోతే అతని ఓడ మునిగిపోయేది. అది మొదలు ఆ ట్రయాంగిల్ గురించి రకరకాల విశ్లేషణలు వచ్చాయి.
పొగలు కక్కే నల్ల సముద్రం
టర్కీ నెత్తి మీద టర్బెయిన్ ఆకారంలో ఉన్న సముద్రాన్ని బ్లాక్ సీ అంటారు. ఒకప్పటి కాలంలో ఒక్కో దిక్కును ఒక్కో రంగుతో సూచించేవాళ్లు. ఉత్తర దిక్కును నలుపుతో, దక్షిణాన్ని ఎరుపుతో, ఉత్తరాన్ని పసుపుతో, పశ్చిమాన్ని తెలుపుతో. ఉత్తర భాగంలో ఉన్న సముద్రం కాబట్టి దాన్ని బ్లాక్ సీ అన్నారు. బ్లాక్ సీ నుంచి వచ్చే ఆవిర్లు సముద్రపు నీటి నుంచి వచ్చే తేమ, నీటి పైనుంచి వచ్చే చల్లటి గాలితో కలిసి ఆవిరిలాగా తయారవుతుంది. సముద్రం అంతా ఆవిరితో కప్పబడి ఉంటుంది. బ్లాక్ సీ నుంచి ఆవిరి చిమ్మడంలో ప్రత్యేకంగా సముద్రపు మిస్టరీ ఏం లేదు. మామూలు నీటి చెలమల్లో జరిగే ప్రక్రియే. కాకపోతే ఎక్కువ త్రీవ్రతతో ఉంటుంది. అంటున్నారు సైంటిస్టులు.
గ్రీన్ ఫ్లాష్
సూర్యాస్తమయం అప్పుడు, సూర్యోదయం సమయంలో సముద్రానికి అవతల ఒక ఆకుపచ్చని కాంతి కనిపిస్తుంది. అది కూడా రెండు సెకన్లు మాత్రమే కనిపిస్తుందిత. భూమి మీద వాతావరణ ప్రభావం వలన అటువంటి ఆకుపచ్చని కాంతులు కనిపిస్తాయి.
సముద్రంలో నురగలు
నీటి ఉపరితలం పైన నిరంతంరం మంథనం జరుగుతుంది. దాని వలన నీటిలో ఉండే జీవజాలం డిస్టర్బ్ అవుతుంది. అందుకే సముద్రం మీద నురగలు ఏర్పడతాయి. అంతేకాదు, టాక్సిన్లను విడుదల చేయడం లాటి కొన్ని మానవ కార్యకలాపాల వలన కూడా డిస్టర్బెన్సెస్ వలన కూడా నురగలు ఏర్పడతాయి.
ఓషనోగ్రఫీతో సముద్ర మథనం
సముద్రం గురించిన అన్ని అంశాల గురించి చేసే అధ్యయనాన్ని ఓషనోగ్రఫీ అంటారు. సముద్ర జీవనం, పర్యావరణ వ్యవస్థ, కరెంట్, తరంగాల గురించి, సముద్ర ప్రాంతంలో అవక్షేపాల కదలిక గురించి తెలుసుకోవడమే ఓషనోగ్రఫీ. సముద్ర పర్యావరణంలో ఓషనోగ్రఫీ నాలుగు రకాలుగా ఉంటుంది. బయోలాజికల్, ఫిజికల్, జియోలాజికల్, కెమికల్ విషయాలలో ఓషనోగ్రాఫర్‌లు స్పెషలైజేషన్ చేస్తారు. ఓషనోగ్రాఫర్ ఒక ప్రత్యేక తరహా సైంటిస్ట్. అత్యంత క్లిష్టమైన సముద్రపు అధ్యయనం. వీళ్లు సముద్రంలోని ప్రతి అంశాన్ని నిశితంగా అధ్యయనం చేస్తారు. సముద్రంలోని కెమిస్ట్రీ, సముద్రానికి సంబంధించిన భూగర్భ శాస్త్రం, సముద్రపు నీటి గతి, సముద్రంలో ఉండే జల చరాలు, మొక్కలు, ఇలా ఎన్నిటి గురించో పరిశోధన చేస్తారు. ఓషనోగ్రాఫర్‌కి ఏడాదికి దాదాపు 90,890 డాలర్ల జీతం ఉంటుంది. ఓషనోగ్రఫీలో జియో సైంటిస్టులు, లేక ఇతర సైంటిస్టులకు జాబ్ మార్కెట్ ఉంది. 2022 కల్లా 16 శాతం ఉద్యోగాలు పెరగనున్నాయి. ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలతో పోలిస్తే ఈ శాతం చాలా ఎక్కువ. వాతావరణ పరిరక్షణకు, నీటి నిర్వహణకు ఓషనోగ్రాఫర్లు, జియోసైంటిస్టుల అవసరం చాలా ఉంది. ఓషనోగ్రాఫర్లు భూ ప్రపంచం మీద ఎక్కడైనా ఉద్యోగం వెతుక్కోవచ్చు. ఓషనోగ్రాఫర్ కావాలనుకునే వారు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్గ్రీ, జియాలజీ బ్యాక్‌గ్రౌండ్‌తో చదువుకుని ఉండాలి. మెరైన్ బయాలజీలో అండర్ గ్రాడ్యుయేట్ బ్యాచిలర్స్ డిగ్రీ అందచేసే స్కూల్స్ ఉన్నాయి. మాస్టర్స్, పీహెచ్‌డి స్థాయి అర్హత పొందిన తర్వాత ఓషన్ సైంటిస్టులుగా కెరీర్ ఎంచుకోవచ్చు.
స్కూబా డైవింగ్ ప్రొఫెషన్‌గా..
నీటిలోపలకి వెళ్లడానికి అండర్ వాటర్ స్కూబా డైవింగ్ ప్రత్యేక సూట్ వేసుకుంటారు. నీటిలో గాలి పీల్చుకోడానికి వీలుగా వీపు వెనక సిలిండర్ పెట్టుకుని మాస్క్ పెట్టుకుంటారు. దీన్ని కాసేపు ఆనందం కోసం వినోద కార్యక్రమంగా భావించేవాళ్లు కొందరు. దాన్ని ప్రొఫెషనల్‌గా తీసుకునేవారు కొందరు. కాళ్లకి చేప మొప్పల ఆకారంలో ఉన్న బూట్ల సహాయంతో ఈదడం మొదలు పెడతారు. ప్రొఫెషనల్ స్కూబా డైవర్స్ ప్రత్యేక శిక్షణతో నైపుణ్యాలు పొందుతారు. డైవర్ సర్టిఫికేషన్ ఇచ్చే సంస్థలు చాలానే ఉన్నాయి. స్కూబా డైవింగ్ చెయ్యాలనుకునే వ్యక్తి శారీరకంగా ఫిట్‌గా ఉండాలి. సముద్రం నీటిలో వింతలు చూడాలంటే స్కూబా డైవింగ్ చెయ్యడమే దారి. నీటి లోపల ఫోన్లుండవ్, కంప్యూటర్లుండవ్. కేవలం శ్వాస తీసుకోవడం మీదనే దృష్టి. దానితో పాటు సముద్రపు అందాలు అన్వేషించుకుంటూ పోవడమే. ఒకసారి డైవింగ్‌లో నిపుణత్వం సాధించాక ఇక ఎక్కడైనా డైవ్ చేసేయగలరు. ‘ప్రొఫెషనల్ స్కూబా డైవర్లు అండర్ వాటర్ రిపేర్, రీసెర్చ్, ఫొటోగ్రఫీ లాటి విభాగాలు ఎంచుకోవచ్చు. 32,067 డాలర్ల నుంచి 156,785 డాలకంల వరకు జీతం పొందచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ ద్వారా ప్రొఫెషనల్‌గా సర్టిఫికేషన్ పొందాలి.
డైవింగ్ స్పాట్‌లు సవాళ్లే..
రెడ్ సీ కోస్తా ప్రాంతంలో ప్రయాణం చేసేవారు బ్లూ హోల్ తప్పకుండా చూడాలి. ప్రపంచంలోకెల్లా అత్యంత అందమైన డైవింగ్ స్పాట్. అందమైందే కాదు ప్రమాదకరమైంది కూడా. హెల్మెట్ పెట్టుకుని డైవింగ్ చేయడం ఉత్తమం. నూట ముప్ఫై మీటర్ల లోతుంటుంది. ఆ ప్రాంతాన్ని ముద్దుగా డైవింగ్ స్మశానం అంటారు. ఆ డైవింగ్ స్పాట్‌లో ప్రమాదకరమైన నైట్రోజన్ నార్కోసిస్ ఉంటుంఇ. నలభై అడుగుల కన్నా ఎక్కువ దిగద్దని వార్నింగ్ ఉంటుంది. లోపలకి వెళ్లే కొద్దీ ఆల్కహాల్ తాగితే ఉన్నంత నషా వచ్చి మైండ్ మొద్దుబారిపోతుంది. దాని లోతులు చూద్దాం అని వెళ్లిన డైవర్లు మృత్యువాత పడిన సంఘటనలూ ఉన్నాయి.
ఓషనోగ్రాఫర్లు, స్కూబాడైవర్లు ఎదుర్కునే ప్రమాదాలకు లెక్క లేదు. సముద్రంలో విషపూరిత జలచరాలు చాలానే ఉంటాయి. వాటి గురించి వారికి అవగాహన ఉంటుంది. అయినా మృత్యువాత పడుతుంటారు. అత్యంత ప్రమాదకరమైన సముద్ర చరాలుంటాయి. సముద్రంలో ఈదాలనుకుంటే ఈ ప్రమాదకరమైన జలచరాల నుంచి జాగ్రత్త పడాలి.
సముద్రపు పాములు
మామూలుగానే పాము జాతులు ప్రమాదకరం. ఇండియన్, పసిఫిక్ సముద్రాలలో సముద్రపు పాములుంటాయి. 4,5 అడుగుల పొడవుంటాయి. చాలా ప్రమాదకర జాతి. అయినా మనుషుల మీద ఎటాక్ చెయ్యడం తక్కువే.
టైగర్ షార్క్
షార్క్ కుటుంబం ప్రమాదకరమైనదే. దాన్ని సీ టైగర్ అంటారు. చేపలు, జంతువులు, సముద్రపు పాములతో పాటు మనుషులనీ తింటాయివి.
చిరోనెక్స్
ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన జలచరాల్లో ఒకటి. దానికున్న పదునైన పళ్లు మనుషుల్ని చంపడానికి బాగా ఉపయోగపడతాయి.
సముద్రంలో అన్నిటికన్నా పెద్ద చేప
వేల్ షార్క్‌లు ఆకారంలో చాలా పెద్దవి. 12.2 మీటర్ల పొడవు పెరుగుతాయి. బరువు40 టన్నులు. అయితే 12 మీటర్ల కంటే పొడవు మాత్రం ఉండవు. బల్లపరుపుగా ఉండే తల, చిన్న ముక్కు ఉంటుంది. వాటి వీపు తెలుపు, పసుపు, బూడిద రంగుల్లో ఉంటుంది. అవి ఎన్నాళ్లు బతుకుతాయన్నది స్పష్టం లేదు కాని దాదాపు 60 నుంచి 100 ఏళ్లు ఉండచ్చని సైంటిస్టుల అంచనా. 20-25 డిగ్రీల ఉష్ణోగ్రతతో నీరు వెచ్చగా ఉండే సముద్రాలలోనే వేల్ షార్క్‌లుంటాయి. ప్లాంక్టన్, స్కూలింగ్ ఫిష్, స్కిడ్ లాటి చిన్న జీవులు వాటి ఆహారం. వాటికి మీటరు పొడవున్న మూతి, ప్రత్యేకంగా తయారైన పళ్లతో ఈదుతుంది.