Home అంతర్జాతీయ వార్తలు ఆడా, మగా మా హెయిర్‌స్టయిల్‌నే పాటించాలి

ఆడా, మగా మా హెయిర్‌స్టయిల్‌నే పాటించాలి

Kim-Jong-Unసియోల్ : ఉత్తర కొరియా దేశాధినేత కిమ్‌జోంగ్-ఉన్ మరో సరికొత్త ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని పురుషులంతా తన హెయిర్‌స్టైల్‌నే అనుసరించాలని హుకుం జారీచేశారు. వారి తల వెంట్రుకలను కేవలం రెండు సెంటీమీటర్ల వరకే ఉంచుకోవాలని, లేదంటే ఆంక్షలు ఎదుర్కోక తప్పవని కిమ్‌జోంగ్ హెచ్చరించారు. అయితే, ఆ ఆదేశాలు ఆడవారికి తెగ సంతోషాన్ని కలిగించాయి. ఆ దేశాధినేత కిమ్ తరహా అద్భుత హెయిర్ స్టైల్‌లోనే తమ పురుషులు ప్రజలలో దర్శన మిస్తున్నందుకు వారు ఆయనకు కృజ్ఞతలు తెలిపారు. అయితే, మహిళల హెయిర్‌స్టైల్‌ను కూడా మార్చాల్సిందేనని ఆయన తన కొత్త ఆదేశాలలో చేర్చారు. తన భార్య రి సోల్-జు హెయిర్‌స్టైల్‌ను స్త్రీలంతా అనుసరించాలని కిమ్‌జోంగ్ సలహా ఇచ్చారు. కేవలం నటులకు మాత్రమే ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇస్తామని ప్రకటించారు. ఈ తాజా పాలసీ ప్రకటనను ఉత్తర కొరియా అధికారులు ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల సరిహద్దు గ్రామమైన పాన్‌ముంజోం గ్రామస్తులతో చరల సందర్భంగా లీకైంది.