Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

యూనివర్సల్ లవ్ స్టోరీ

cini

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ప్రేక్షకులను మెప్పించగలిగే అంశాలు ఉండేలా చూసుకొని కాస్త ఎమోషన్, మరికాస్త సెంటిమెంట్ రంగరించి దానికి ప్రేమకథను జత చేస్తే అంతకు మించిన హిట్ కంటెంట్ మరొకటి ఉండదు. ఇప్పుడు అలాంటి అన్ని అంశాలతో కలిసి వస్తున్న సినిమా ‘నా లవ్ స్టోరీ’. మహీధర్, సోనాక్షి సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివ గంగాధర్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

మంచి స్క్రీన్‌ప్లేతో…
దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. ఈ సినిమాలో కథే హీరో. యూత్‌కు నచ్చే యూనివర్సల్ లవ్ స్టోరీ ఇది. ప్రతి సీన్ కథలో మిళితమయ్యే ఉంటుంది. మంచి స్క్రీన్‌ప్లే ఉంటుంది.
ఇప్పటివరకు రాని పాయింట్…
హీరోహీరోయిన్లు మహీధర్, సోనాక్షి సింగ్ చక్కగా నటించారు. వారి తండ్రుల పాత్రల్లో శ్రీమన్నారాయణ, తోటపల్లి మధులు కడుపుబ్బ నవ్విస్తారు. కథానుగుణంగా చూస్తే హీరోతో మొదలయ్యే లవ్‌స్టోరీ హీరోయిన్‌తో ముగుస్తుంది. ఇది ఇప్పటివరకు రాని పాయింట్.
తల్లిదండ్రులు మారతారు…
ఈ లవ్‌స్టోరీలో ప్రేమికులిద్దరూ కలిసి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తల్లి దండ్రుల్లో మార్పు తీసుకొస్తుంది. సినిమా చూసి చాలా మంది తల్లిదండ్రులు మారతారనే నమ్మకముంది.
అద్భుతమైన పాటలు…
సంగీత దర్శకుడు వేదనివాస్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. భువనచంద్ర, శివశక్తి దత్త అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. సినిమా విజయంలో పాటలు ఎంతగానో తోడ్పడుతాయి.
నచ్చే అంశాలన్నీ…
ఆద్యంతం హాయిగా సాగిపోయే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకముంది.

Comments

comments