Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

కల్యాణ్‌రామ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే ‘నా నువే’

ntr

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో నందమూరి కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. జయేంద్ర దర్శకత్వంలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా గురువారం విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ “అన్నయ్య కల్యాణ్‌రామ్‌ను చూస్తుంటే మూడేళ్ల క్రితం నేను పడ్డ టెన్షన్ గుర్తుకొచ్చింది. బ్లాక్‌బస్టర్ మూవీ ‘నాన్నకు ప్రేమతో’లో కొత్త గెటప్‌లో నటించాను. అయితే అప్పటివరకు నేను చేసిన సినిమాలకంటే భిన్నమైన ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందా అని అనుకున్నాను. ఆరోజు ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేసేటప్పుడు నేనెలా ఫీల్ అయ్యానో… అన్నయ్య ముఖం చూస్తుంటే అలాగే అనిపించింది. కానీ తప్పదు ఈ టెన్షన్స్‌తో కూడిన ప్రయాణం నటుడికి సర్వసాధారణం. నిజంగా కష్టపడితే ఆ చిత్రానికి పెద్ద పీట వేయడమనేది తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. అలాంటి చిత్రాలకు చెందిన కోవలో ‘నా నువ్వే’ కూడా నిలుస్తుందని నా ప్రగాఢ నమ్మకం. మా అన్న కల్యాణ్ కెరీర్‌లో ఈ చిత్రం మైలురాయిగా నిలిచిపోవడమే కాదు… ఇలాంటి ఇంకెన్నో కొత్త చిత్రాలు, ప్రయోగాలు ఆయన చేయాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ “శరత్ అందించిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్ అయ్యాయి. ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ మూవీ ఇది. సినిమాలో నా మేకోవర్ కొత్తగా ఉంటుంది. తమన్నా చాలా ఫ్రెష్ లుక్‌తో కనపడుతుంది. సినిమా ఇంత బాగా రావడానికి కారణం దర్శకుడి నమ్మకమే. పి.సి.శ్రీరామ్ సినిమాను ఎంతో అందంగా చూపించారు. నాకెరీర్‌లో ఇంతవరకు చేయని ప్రయత్నమిది. దీన్ని అందరూ ఆదరిస్తారనే నమ్మకముంది”అని పేర్కొన్నారు. దర్శకుడు జయేంద్ర మాట్లాడుతూ “నాపై పెద్ద నమ్మకముంచి కల్యాణ్‌రామ్ ఈ సినిమా చేశారు. యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన ఈ సినిమాతో రొమాంటిక్ జోనర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ హీరోయిన్ అయిన తమన్నా ఓ కొత్త హీరోయిన్‌లా ఈ సినిమా కోసం పనిచేసింది. శరత్ గొప్ప సంగీతాన్ని అందించాడు”అని పేర్కొన్నారు. నిర్మాత మహేశ్ కోనేరు మాట్లాడుతూ “ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నిర్మాతగా నా తొలి చిత్రమిది. మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న కల్యాణ్‌రామ్ ఈ సినిమాతో క్లాస్ ఆడియన్స్‌కు దగ్గరవుతారని నమ్మకంగా ఉంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శరత్, పిడివి ప్రసాద్, విజయ్ చిల్లా తదితరులు పాల్గొన్నారు.

Comments

comments