Home సినిమా ఫ్రెష్ లుక్ లవ్ స్టోరీ

ఫ్రెష్ లుక్ లవ్ స్టోరీ

n-nuvve

నందమూరి కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ‘నా నువ్వే’. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ మహేశ్ కోనేరు సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో జయేంద్ర దర్శకత్వంలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ పొందింది. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి మాట్లాడుతూ “ఫ్రెష్ లుక్ లవ్ స్టోరీ ఇది. దర్శకుడు జయేంద్ర సినిమాను అద్భుతమైన ఫీల్‌తో తెరకెక్కిస్తే… పి.సి.శ్రీరామ్ ఎక్స్‌ట్రార్డినరీ విజువల్స్‌తో ప్రతి ఫ్రేమ్‌ను అందంగా చూపించారు. ఇప్పటివరకు నందమూరి కల్యాణ్‌రామ్ చేయనటువంటి రొమాంటిక్ జోనర్ చిత్రమిది. కల్యాణ్‌రామ్, తమన్నాలను కొత్త మేకోవర్‌లో చూస్తారు. శరత్ అందించిన పాటలకు మంచి స్పందన వస్తోంది. హృదయాన్ని హత్తుకునే క్యూట్, బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది”అని అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌ః టి.ఎస్.సురేష్, కథ, స్క్రీన్‌ప్లేః జయేంద్ర, శుభ.