Home సినిమా మురిపించే రొమాన్స్

మురిపించే రొమాన్స్

na-nuvve

నందమూరి కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో జయేంద్ర దర్శకత్వంలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఈనెల విడుదలకానుంది. ఇప్పటివరకు మాస్, కమర్షియల్ సినిమాలు చేసిన నందమూరి కల్యాణ్‌రామ్ సరికొత్త లుక్‌లో కనపడుతూ ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన  థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పటికే ఈ టైలర్‌ను  7.2 మిలియన్ ప్రేక్షకులు వీక్షించారు. నందమూరి కల్యాణ్‌రామ్, తమన్నా మధ్య కెమిస్ట్రీ, స్టార్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ అందించిన అమేజింగ్ విజువల్స్, శరత్ అందించిన మెలోడియస్ ఆల్బమ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.