Home తాజా వార్తలు పవన్ కెరీర్ అయిపోయినప్పుడు రాజకీయాల్లోకి రాలేదు..

పవన్ కెరీర్ అయిపోయినప్పుడు రాజకీయాల్లోకి రాలేదు..

bunni

హైదాబాద్: స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా ఆడియో ఫంక్షన్ ఆదివారం పశ్చిమగోదావరి జల్లాలోని మిలటరీ మాధవరంలో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో బన్నికి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. మే 4న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒక నెంబర్ వన్ హీరోనని, ఆయన ఒక సినిమా చేస్తే కోట్లు వస్తాయన్నారు. కానీ, అలాంటి జీవితాన్ని వద్దనుకొని జనం కోసం ఏదో చేద్దామని ఎండల్లో తిరుగుతున్నారన్నారు. కెరీర్ అయిపోయినప్పడు పవన్ ప్రజాసేవ కోసం రాలేదని, నంబర్ వన్ స్థానంలో ఉన్నడు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని, అది నాకు నచ్చలేదన్నారు. మాట్లాడిన వారిది తప్పు, అలా మాట్లాడిచ్చిన వారిది తప్పని..ఇలా మాట్లాడారని లక్షల మంది జనాలకు చూపించడం ఇంకా పెద్ద తప్పన్నారు.వెలిగింది అగ్గిపుల్లే కావొచ్చని, కానీ మంట ఊరంతా అంటించడానికి సహాయపడిన పెట్రోల్ ట్యాంక్‌ది పెద్ద తప్పఅయిపోతుందని బన్ని భావోద్వేగానికి గురయ్యారు.