Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

‘సూర్య’ డైలాగ్ ఇంపాక్ట్ సూపర్బ్…

Naa Peru Surya Naa Illu India Dialogue Impact

హైదరాబాద్: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, వక్కంతం వంశీ కాంబోలో వస్తున్న నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఆదివారం బన్నీ పుట్టిన రోజు సందర్భంగా మూవీకి సంబంధించిన డైలాగ్ ఇంపాక్ట్ ను విడుదల చేశారు. ఈ ఇంపాక్ట్ లో ‘అన్ని ఇండియాలు లేవురా మనకి’.. ఒకటే ఇండియా… అంటూ బన్నీ పలికిన డైలాగ్ చాలా బాగుంది. బన్నీ తొలిసారిగా ఆర్మీ ఆఫీసర్‌ గా నటిస్తున్న ఈ మూవీలో అను ఇమ్మాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. పలు విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Comments

comments