Search
Sunday 23 September 2018
  • :
  • :

ఆ మహిళలు చెప్పినవే బెస్ట్ కాంప్లిమెంట్స్: అల్లు అర్జున్

Naa Peru Surya Naa Illu India movie success

అల్లుఅర్జున్ హీరోగా శ్రీరామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శిరీషా శ్రీధర్ రూపొందించిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో థాంక్స్ టు ఇండియా మీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ “వక్కంతం వంశీ నేను ‘కొమరం పులి’ చేసేటప్పుడు ఓ కథ చెప్పారు. దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయాను. ఆయన ఇవాళ అల్లుఅర్జున్‌లాంటి పెద్ద హీరోతో సినిమా చేశారు. ఇక మా అన్నయ్య నాగబాబు దీనికి ఒక నిర్మాత అని కూడా తెలియదు. సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నట్టు నాకు చెప్పడు. అల్లుఅర్జున్ నటించిన ‘బన్నీ’ తర్వాత ‘ఆర్య’ సినిమా నాకు నచ్చింది. ఆతర్వాత ‘దేశముదురు’ వంటి సినిమాలతో ఆయన ఎదిగాడు. ఇప్పుడు ‘నా పేరు సూర్య’ చిత్రంతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అల్లుఅర్జున్ ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి”అని చెప్పారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ “నా పేరు అల్లు అర్జున్… నా ఇల్లు ఇండియా. ఈ ఫంక్షన్ పేరు థాంక్యూ ఇండియా. అందులో తొలి థాంక్యూ మా పవన్‌కళ్యాణ్, ఆయన అభిమానులకు. నాకు ఆర్మీలాగా నిలుచునే అభిమానులకు.  ఈ సినిమా గురించి నాకు ఓ బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది. ‘సినిమా చూశాం… చాలా బావుంది. మా పిల్లలు మిలటరీ యూనిఫామ్ కుట్టించుకోవాలనుకుంటున్నారు’ అని చాలా మంది మహిళలు నాతో చెప్పారు. అది విని చాలా ఆనందించాను”అని అన్నారు. వక్కంతం వంశీ మాట్లాడుతూ “దర్శకుడిగా నా తొలి సినిమా అవకాశం ఇలాంటి పెద్ద సినిమా రూపంలో రావడం చాలా సంతోషం. కంటెంట్‌ను కమర్షియల్‌గా కూడా చెప్పవచ్చని నేను అన్న మాట నమ్మి నాతో అల్లు అర్జున్ ప్రయాణం చేశారు. సినిమా ఇంత రిచ్‌గా రావడానికి నిర్మాతలు చాలా సహకరించారు”అని పేర్కొన్నారు. లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ “వక్కంతం వంశీ ఈ సినిమాను తర్వాత తరాల కోసం చేశారు. విద్యార్థులు ఎవరైనా ఈ సినిమా చూస్తే తప్పకుండా వారిలో ఒక మార్పు, ఒక వెలుగు వస్తుందని అనుకుంటాను”అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, అశోక్, మెహర్ రమేష్, రామజోగయ్యశాస్త్రి, బన్నీ వాసు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments