Search
Tuesday 20 November 2018
  • :
  • :

‘నా పేరు సూర్య’ ట్రైల‌ర్ వచ్చేసింది…

Naa Peru Surya Naa Illu India Theatrical Trailer Out now

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రచయితగా పలు విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన వ‌క్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. వ‌క్కంతం మంచి రైటర్ కావడంతో మూవీలో డైలాగ్స్ చాలా బాగా ఉన్నాయి. ముఖ్యంగా ‘క్యారెక్టర్‌ వదిలేయడం అంటే.. ప్రాణాలు వదిలేయడమే.. చావు రాకముందు చచ్చిపోవడమే’ ,  ‘నీకు ఏం కావాలి రా!’ అని అడిగితే ‘ఇండియా కావాలి. ఇచ్చేయ్‌’ అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. బన్నీ సరసన కథనాయికగా అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తున్న ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్, బోమన్ ఇరానీ, నదియా తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. లగడపాటి శ్రీధర్, బన్నీవాస్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్-శేఖర్ బాణీలు అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకోకగా, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోందీ సినిమా. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments