Home అంతర్జాతీయ వార్తలు షరీఫ్‌కు ఎన్‌ఎబి సమన్లు

షరీఫ్‌కు ఎన్‌ఎబి సమన్లు

Nawaz-Sharif

లాహోర్ : పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు, ఆయన కొడుకులు హుస్సేన్, హాసన్‌లకు పాక్ జాతీయ జవాబుదారీ సంస్థ ఎన్‌ఎబి సమన్లు జారీ చేసింది. షరీఫ్‌తో పాటు అతని కొడుకులు పనామా పత్రాల కేసు, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆగస్టు 18న తమ ఎదుట హాజరు కావాలని ఎన్‌ఎబి వారికి సమన్లు ఇచ్చింది. పాక్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్‌ఎబి పనామా పత్రాల కేసును విచారిస్తోంది. షరీఫ్ ప్రధాన అనుచరుడైన మాజీ ఆర్థిక శాఖ మంత్రి విశాల్‌దార్‌ను ఈనెల 23న తమ ఎదుట హాజరు కావాలని ఎన్‌ఎబి ఆదేశించింది.

NAB is summoned to Pak Ex PM Sharif