Search
Sunday 23 September 2018
  • :
  • :

సెమీస్‌కు అడుగు దూరంలో నాదల్, ఫెదరర్

 యుఎస్ ఓపెన్ నాల్గోరౌండ్‌లో టెన్నిస్ దిగ్గజాలు
Tennis

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టోర్నమెంట్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌లు సెమీఫైనల్‌కు అడుగుదూరంలో నిలిచారు. మూడో రౌండ్‌లో తమ ప్రత్యర్థులపై గెలిచిన ఇద్దరు టెన్నిస్ దిగ్గజాలకు సెమీఫైనల్ పోరులో తలపడటం అనివార్యమైనట్టే కనిపిస్తోంది. మూడో రౌండ్‌లో లియోనార్డో మేయర్ (అర్జెంటీనా)పై 67, (3/7), 63, 61, 6-4 తేడాతో నాదల్ విజయం సాధించి నాల్గో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మరోవైపు స్విస్ దిగ్గజం ఐదు సార్లు ఛాంపియన్ రోజర్ ఫెదరర్ తన ప్రత్యర్థి 31వ సీడ్ ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్)పై 63, 6-3, 75 తేడాతో గెలిచి రికార్డు సృష్టించాడు. అలెగ్జాండర్ డోల్గోపోలోవ్ (ఉక్రేయిన్)తో నాదల్ క్వార్టర్‌ఫైనల్లో తలపడనుండగా, ఫెదరర్ జర్మనీ టెన్నీస్ క్రీడాకారుడు ఫిలిప్ కోల్స్ చ్రెబెర్ తలపడనున్నాడు. లోపెజ్‌ను ఓడించిన నాదల్ 16వ సారి నాల్గోరౌండ్‌లోకి ప్రవేశించాడు. డామిర్ జమ్హూర్ (బోస్నియా)పై 64, 6-4, 57, 64 తేడాతో అండ్రీ రుబ్లే (రష్యా)పై విజయం సాధించాడు. మహిళా అంఫైర్‌ను దూషించినందుకు ఫాబియో ఫోగ్నిని (ఇటలీ) టోర్నమెంట్‌ను నిష్క్రమించబడ్డాడు. ప్రత్యర్థి సిమోన్ బోలెలీపై గెలిచి మూడో రౌండ్‌కు చేరినప్పటికీ టోర్నమెంట్ నిర్వహకులు వేటు వేయడంతో యుఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించక తప్పలేదు. ప్రపంచ నెంబర్ 26 ఫోగ్నినికి యుఎస్‌డి 24వేల డాలర్ల జరిమానా విధించారు. మరోవైపు కరోలిన ప్లస్కోవా (చెక్) టెన్నిస్ క్రీడాకారిణి తన ప్రత్యర్థి జాంగ్ షుయ్ (చైనా)పై గెలిచి నాల్గోరౌండ్‌లోకి ప్రవేశించి తన ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంది.

Comments

comments