Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

హలెప్‌కు షాక్..

sprts

సువి సంచలనం, నాదల్, కసట్కినా, డెల్‌పొట్రొ ముందంజ
లండన్: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి జోరుమీదున్న ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి వింబుల్డన్‌లో మాత్రం ఆ జోరును కొనసాగించలేక పోయింది. శనివారం హోరాహోరీగా సాగిన మూడో రౌండ్‌లో తైవాన్ క్రీడాకారిణి సువి సి చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్), ఐదో సీడ్ జువాన్ మార్టిన్ డెల్‌పొట్రొ (అర్జెంటీనా),13వ సీడ్ రొనిక్ (కెనడా) ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. మహిళల విభాగంలో 12వ సీడ్ జెలినా ఒస్టాపెంకొ (లాత్వియా), 14వ సీడ్ డారియా కసట్కినా (రష్యా), అలిసన్ వ్యాన్ (బెల్జియం) మూడో రౌండ్‌లో విజయం సాధించారు.
హోరాహోరీ..
తైవాన్ క్రీడాకారిణి సువీతో జరిగిన పోరులో హలెప్ పోరాడి ఓడింది. తొలి సెట్‌లో హలెప్ పైచేయి సాధించింది. చూడచక్కని షాట్లతో అలరించిన హలెప్ ప్రత్యర్థిని హడలెత్తించింది. హలెప్ తన మార్క్ షాట్లతో చెలరేగడంతో సువీకు ఇబ్బందులు తప్పలేదు.
చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న హలెప్ సెట్‌ను సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్‌లో పరిస్థితి తారుమారు అయ్యింది. ఈసారి సువి పుంజుకుంది. హలెప్ జోరుకు అడ్డుకట్ట వేస్తూ ముందుకు సాగింది. కళ్లు చెదిరే షాట్లతో విరుచుకు పడిన సువి సెట్‌ను దక్కించుకుంది. ఇక, ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో పోరు ఉత్కంఠభరితంగా సాగింది. ఇరువురు ప్రతి పాయింట్ కోసం నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన సువి సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకునే నాలుగో రౌండ్‌కు చేరుకుంది. మరో పోటీలో ఒస్టాపెంకొ విజయం సాధించింది. రష్యా క్రీడాకారిణి విటాలియాతో జరిగిన మూడో రౌండ్‌లో ఒస్టా పెంకొ 60, 64తో జయకేతనం ఎగుర వేసింది. మరో పోటీలో 14వ సీడ్ కసట్కినా విజయం సాధించింది. 17వ సీడ్ బార్టి (ఆస్ట్రేలియా)తో జరిగిన పోరులో 75, 63తో విజయం సాధించింది. మరోవైపు అలిసన్ వ్యాన్ బెల్జియం కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఇస్టోనియా క్రీడాకారిణి కొంటావెట్‌తో జరిగిన మ్యాచ్‌లో వ్యాన్ 62, 63తో జయభేరి మోగిం చింది. మరో పోటీలో 15వ సీడ్ ఎలిసె మార్టిన్స్ విజయం సాధించింది. చిబుల్కొవా (స్లోనేవియా)తో జరిగిన మ్యాచ్‌లో మార్టిన్స్ 62, 62తో గెలు పొందింది.

నాదల్ అలవోకగా..

nadal

పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో నాదల్ 61, 62, 64తో ఆస్ట్రేలియా ఆటగాడు మినౌర్‌ను ఓడించాడు. ప్రారంభం నుంచే నాదల్ చెలరేగి ఆడాడు. ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. దూకుడుగా ఆడుతూ ముందుకు సాగాడు. నాదల్ విజృంభించడంతో ప్రత్యర్థి మినౌర్ కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేక పోయాడు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న నాదల్ సునాయాస విజయంతో నాలుగో రౌండ్‌లో ప్రవేశించాడు. మరోవైపు ఐదో సీడ్ డెల్‌పొట్రొ కూడా మూడో రౌండ్‌లో విజయం సాధించాడు. ఫ్రాన్స్ ఆటగాడు బెనైట్ పెయిర్‌తో జరిగిన మ్యాచ్‌లో డెలపొట్రొ 64, 76, 63తో జయకేతనం ఎగురు వేశాడు. తొలి రెండు సెట్లలో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా డెల్‌పొట్రొ పట్టు వీడలేదు. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఫ్రాన్స్ ఆశాకిరణం గిల్స్ సిమోన్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. హోరాహోరీగా సాగిన పోరులో సిమోన్ 61, 67, 63, 76తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. కాగా, 13వ సీడ్ మిలొస్ రొనిక్ కూడా మూడో రౌండ్‌లో విజయం సాధించాడు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రొనిక్ 76, 46, 75, 62తో ఆస్ట్రియా ఆటగాడు డెనిస్ నొవాక్‌పై జయకేతనం ఎగుర వేశాడు.

Comments

comments