Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

బయోపిక్‌పై బాలకృష్ణకు నోటీసులు

balaya
హైదరాబాద్: నటుడు, ఎంఎల్ఎ నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఎన్ టిఆర్ బయోపిక్‌పై మాజీ సిఎం నాదెండ్ల భాస్కరరావు కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిన్మా విషయంలో తమను ఎవరు సంప్రదించలేదని, నాదెండ్ల పాత్రను తప్పుగా చూపించే ప్రయత్నం జరుగుతోందంటూ నోటీసులు పంపించారు. ఎంఎల్ఎ హోదాలో ఒకటి, నటుడి హోదాలో ఒకటి మొత్తం రెండు నోటీసులను బాలకృష్ణకు పంపారు. దర్శకుడు క్రిష్‌కు మరో నోటీసు పంపారు. ఈ చిత్రంలో నాదెండ్ల పాత్రకు సంబంధించిన విషయంలో ఎవరూ తమ నుంచి అనుమతులు తీసుకోలేదని, సినిమా నిర్మాణం నిలిపివేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

Comments

comments