Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే పనులు ప్రారంభం

SURESH

విజయవాడ : రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని పిడుగురాళ్లలో శిలాపలకాన్ని వీడియో లింక్ ద్వారా ఆవిష్కరించారు. దీంతో పాటు విశాఖ – తిరుపతి డబుల్ డెక్కర్ రైలు, గుంటూరు రైల్వేస్టేషన్‌లో వైఫె సౌకర్యం, విజయవాడలోని సత్యనారాయణపురంలో ఈటిటిసి కొత్త హాస్టల్ భవనం సముదాయాన్ని కూడాప్రారంభించారు. విజయవాడలోని రూట్ రిలే ఇంటర్ లాకింగ్ వ్యవస్థను జాతికి అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపి సిఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, విజయవాడ ఎంపి కేశినేని నాని, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Comments

comments