Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

నాగచైతన్య ఆటాపాట

nagachaitanya‘ఏ మాయ చేశావే’ సినిమాతో హిట్ కాంబినేషన్‌గా మారిన నాగచైతన్య, గౌతమ్ మీనన్‌లు కలిసి తాజాగా ‘సాహసం శ్వాసగా సాగిపో’ అంటూ మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు వర్షన్‌లో నాగచైతన్య హీరోగా, తమిళ వర్షన్‌లో శింబు కథానాయకుడిగా చేస్తున్నారు. అందాల తార మంజిమ మోహన్ రెండు వర్షన్‌లలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఎ.ఆర్.రెహమాన్ అందించిన ఒక రాక్ సాంగ్‌కు నాగచైతన్య స్టెప్పులేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా టీజర్‌లో నాగచైతన్య డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్స్, ఫ్లేవర్ అంతా ‘ఏ మాయ చేశావే’ను పోలి ఉండడంతో నాగచైతన్య-గౌతమ్ మీనన్‌ల మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెహమాన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని సినిమా యూనిట్ చెబుతోంది. త్వరలోనే ఆడియోను రిలీజ్ చేసేందుకు సినిమా టీమ్ ప్లాన్ చేస్తోంది. నవంబర్ చివరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

Comments

comments