Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

చైతన్య సినిమాలపై ప్రత్యేక శ్రద్ధ

Naga chaitanya and Samantha New movie Details

సమంతతో పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య నటించిన సినిమా ఏదీ ఇంకా విడుదల కాలేదు. గత ఏడాది వేసవిలో వచ్చిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ తర్వాత చైతూ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈనెల 31న రావాల్సిన ‘శైలజారెడ్డి అల్లుడు’ అనూహ్యంగా వాయిదా పడడంతో అభిమానులు నిరాశ చెందారు. కేరళలో వరదల కారణంగా సంగీత దర్శకుడు గోపీసుందర్  రీరికార్డింగ్ పూర్తి చేయలేకపోవడమే ఈ సినిమా వాయిదా పడటానికి కారణమని అంటున్నారు. అయితే దాంతో పాటుగా ఎడిటింగ్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం కూడా సినిమా ఆలస్యం అవుతుండటానికి కారణమని తెలిసింది.

పెళ్లి తర్వాత వరుసగా రంగస్థలం, మహానటి, అభిమన్యుడు వంటి బ్లాక్‌బస్టర్లను తన ఖాతాలో వేసుకున్న సమంత తన భర్తకు కూడా విజయాలు దక్కాలని ఆశిస్తోంది. ఇందుకోసం చైతన్య సినిమాల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందట. ‘శైలజా రెడ్డి అల్లుడు’ రషెస్ చూసి సమంత కొన్ని సూచనలు చేసిందట. వీటిని సీరియస్‌గా తీసుకున్న చైతన్య చిత్ర బృందానికి ఆ మేరకు మార్పులు చేయాలని చెప్పాడట. అలాగే తన మరో సినిమా ‘సవ్యసాచి’ విషయంలోనూ సమంత సలహాలను చైతన్య పాటిస్తున్నాడని తెలిసింది. అయితే భర్త మీద ప్రేమతో అతని సినిమాలు బాగా రావాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ… మరీ ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఈ విషయంలో సమంత కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే మంచిది.

Comments

comments