Search
Saturday 17 November 2018
  • :
  • :

యాడ్ ఫిలింమేకర్‌గా నాగచైతన్య

nagachaity

నేడు హీరోలు సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేయాలని కోరుకుంటున్నారు. విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరించాలని వారు తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ప్రేమమ్’లో ఒక స్టూడెంట్‌గా… ఆతర్వాత ‘రారండోయ్ వేడుక చూద్దాం’లో కాంట్రాక్టర్ కమ్ సివిల్ ఇంజినీర్‌గా కనిపించిన నాగచైతన్య ఇప్పుడు తన తదుపరి సినిమాలో మరో ప్రొఫెషన్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. గతంలో ‘బద్రి’లో పవన్‌కళ్యాణ్, ‘మన్మథుడు’లో నాగార్జున యాడ్ ఏజెన్సీ నడుపుతూ యాడ్ ఫిలిం మేకర్లుగా కనిపించారు. ఇప్పుడు అదేవిధంగా నాగచైతన్య కూడా త్వరలో మొదలుకానున్న చందు మొండేటి సినిమాలో ఒక యాడ్ ఫిలింమేకర్‌గా కనిపిస్తాడట. ఈ సినిమా ఒక రొమాంటిక్ కామెడీ కావడంతో… ఇది మన్మథుడు సినిమాకు సీక్వెల్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే మొన్నటివరకు వరుసగా రొమాంటిక్ కామెడీలు చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు తాజాగా చేస్తున్న ‘యుద్ధం శరణం’ సినిమాతో మరోసారి యాక్షన్ బాట పట్టాడు. అంతగా తనకు అచ్చిరాని యాక్షన్ జోనర్‌లో ఎటువంటి హిట్ కొడతాడో తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే.

Comments

comments