Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

తాతయ్య పాత్రలో మనవడు

nag

సి.అశ్వనీదత్ సమర్పణలో అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మహానటి’. కీర్తిసురేష్ టైటిల్ పాత్రలో నటిస్తోంది. జెమిని గణేషన్ పాత్రలో దుల్కార్ సల్మాన్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కీలక పాత్రలకు మహామహుల్ని ఎంపికచేసిన సంగతి తెలిసిందే. అయితే సావిత్రి జీవితంలో… కెరీర్‌పరంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలు అంతే కీలకం. మరి ఆ పాత్రల్లో నటించేది ఎవరు? ఇంతవరకు ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాగచైతన్య తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించనున్నాడని తెలిసింది. ఇప్పటికే ప్రకాష్‌రాజ్, క్రిష్‌లాంటి వాదందరూ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం నాగచైతన్య ఎంట్రీతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. త్వరలోనే నాగచైతన్య షూటింగ్‌లో పాల్గొంటాడు.

Comments

comments