Search
Wednesday 26 September 2018
  • :
  • :

నాగచైతన్య ‘మంచోడు’

Naga-Chaitanya

భలే భలే మగాడివోయ్, బాబు బంగారం, మహానుభావుడు వంటి క్యాచీ టైటిళ్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు మారుతి. అతను తన నెక్స్ మూవీకి మరో క్యాచీ టైటిల్ పెట్టినట్లు సమాచారం. అక్కినేని నాగచైతన్య హీరోగా మారుతి చేయబోయే సినిమాకు ‘మంచోడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశాడట. ఈ చిత్రాన్ని నిర్మించబోయే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ టైటిల్‌ను ఇప్పటికే రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. ఇటీవలే ‘యుద్ధం శరణం’తో నిరాశచెందిన చైతన్యకు తర్వాత చేయబోయే సినిమాలు కీలకం. అతను చందూమొండేటితో ‘సవ్యసాచి’ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే నెలలో మొదలుపెట్టి… ఆతర్వాత మారుతి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ఆరంభమవుతుంది. ఈ చిత్రంలో సమంత కథానాయిక అని ఊహగానాలు వినిపించాయి కానీ దీనిని చైతన్య ఖండించాడు. ‘ప్రేమమ్’ తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగచైతన్య చేయబోయే సినిమా ఇది. మారుతి స్టయిల్లో పక్కా ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు. ఇక ‘సవ్యసాచి’ యాక్షన్ నేపథ్యంలో సాగే ప్రయోగాత్మక చిత్రం. ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. చైతన్య చేయబోయే రెండు సినిమాలకు కూడా ఇంకా కథానాయికలు ఖరారు కాలేదు.

Comments

comments