Home సినిమా ఐపిఎస్ ఆఫీసర్‌గా చైతూ

ఐపిఎస్ ఆఫీసర్‌గా చైతూ

Naga-Chaitanya
‘మజిలీ’ సక్సెస్‌తో ఎంతో సంతోషంగా ఉన్న నాగచైతన్య అదే ఉత్సాహంతో ‘వెంకీ మామ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ‘ఆర్‌ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి రెండో సినిమా ‘మహా సముద్రం’ను దాదాపు ఓకే చేసినట్టు తెలిసింది. హీరోయిన్‌గా సమంత కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రంలో చైతూ ఓ కొత్త రోల్ చేయబోతున్నారు. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో మాఫియా కథాంశాన్ని తీసుకొని అజయ్ భూపతి స్క్రిప్ట్‌ను రూపొందించినట్టు తెలిసింది. ఇందులో చైతూ ఐపిఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తారట. ఇక నాగార్జున ఐపిఎస్ ఆఫీసర్‌గా చేసిన రక్షణ, శివమణి, నిర్ణయం చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు చైతూ వంతు వచ్చింది. అజయ్ భూపతి ఈ స్క్రిప్ట్ మీదే గత ఏడాది కాలంగా వర్క్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ పేరు మహా. వైజాగ్ బ్యాక్‌డ్రాప్ కాబట్టి టైటిల్‌లో సముద్రం అని పెట్టారు. మహా ప్రేమ కోసం పోరాడుతూనే సముద్రాన్ని దోచుకుంటున్న మాఫియాను అంతం చేయడమే లక్షంగా పెట్టుకున్న హీరో కథ ఇదని తెలిసింది. సినిమా గురించి మరిన్ని వివరాలు మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

Naga Chaitanya Playing Police Officer Role in His Next Film