Search
Friday 16 November 2018
  • :
  • :

వీరి ‘మజిలి’ ఏ తీరానికి?

Naga Chaitanya,Samantha Act in Emayashesave

‘ఏ మాయ చేసావె’ సినిమాలో కలిసి నటించిన నాగచైతన్య, సమంత అందులో ప్రేమికులుగా చక్కగా ఒదిగిపోయి ప్రేక్షకులను అలరించారు. ఆ సినిమా ఎఫెక్టో ఏమో కానీ ఆతర్వాత నిజమైన ప్రేమికులుగా మారారు. దాదాపు పదేళ్ల తర్వాత ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. రియల్ లైఫ్ కపుల్‌గా మారారు. పలు సినిమాల్లో కలిసి నటించిన ఈ హిట్ జంట పెళ్లయిన తర్వాత మాత్రం ఒక్క సినిమా కూడా కలిసి చేయలేదు. కానీ ఇప్పుడు ఆ కల నెరవేరబోతోంది. ‘నిన్ను కోరి’ వంటి క్లాసిక్ లవ్ స్టోరీని తీసిన దర్శకుడు శివ నిర్వాణ ఇప్పుడు నాగచైతన్య, సమంత జోడీగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. వీరిద్దరిని దృష్టిలో పెట్టుకొని ఓ మంచి కథను అతను తయారుచేశాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘మజిలి’ అనే టైటిల్‌ను పెట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ క్రేజీ కాంబినేషన్‌లోని మూవీ టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలోనూ నాగచైతన్య, సమంత భార్యభర్తలుగా నటిస్తారు.

Comments

comments