Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

వారికి ఇష్టం లేదని.. చైతు – సమంత పెళ్లి కాన్సిల్?

Naga Chaitanya Samantha Breakupటాలీవుడ్ లవ్ బర్డ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది.. సమంత, నాగచైతన్యలే… తమ తొలి చిత్రం నుంచే వీరిద్దరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కింగ్ నాగార్జున కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. త్వరలో నిశ్చితార్థం.. వచ్చే ఏడాది పెళ్లి చేస్తామని నాగార్జున పబ్లిక్‌గా ప్రకటించారు కూడా. వారిద్దరు కూడా ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.
కానీ ఇప్పుడు ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ అనుకోని మలుపు తిరిగింది. నాగ చైతన్యతో, సమంత వివాహానికి పెళ్లి కొడుకు తరుపు వారందరూ ఒప్పుకునా.. పెళ్లి కూతురి తల్లిదండ్రులు మాత్రం ఈ వివాహానికి అంగీకారం తెలపడం లేదని టి టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. సమంత తల్లిదండ్రులకు చైతన్యతో ఆమె వివాహం ఇష్టం లేదని.. దీంతో ఆ టాపిక్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక సాకు చెబుతూ దాటివేస్తున్నారటా…
గత ఆరు నెలలుగా ఈ తతంగం నడుస్తుండగా.. చివరికి సమంత తన తల్లిదండ్రులను గట్టిగా నిలదీయడంతో వాళ్లు “ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో.. మేము పెళ్లికి రాము” అని తెగేసి చెప్పరటా.. దీంతో పెళ్లి కాన్సిల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న నాగార్జున వియ్యకులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి నాగ్ మాటలతో వారు కూల్ అయ్యి పెళ్లికి ఒప్పుకుంటారా… లేక గొడవ మరింత పెద్దదయి.. పెళ్లి కాన్సిల్ అవుతుందా.. వేచి చూడాల్సిందే..

Comments

comments