Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

నాగచైతన్య, శృతిహాసన్‌ల ప్రేమం

Premamఅక్కినేని నాగచైతన్య, శృతిహాసన్‌ల తొలి కాంబినేషన్‌లో ‘కార్తికేయ’ ఫేం చందు మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని  రీమేక్ చేస్తున్నారు సూర్యదేవ నాగవంశీ. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ “నాగచైతన్య, శృతిహాసన్, చందు మొండేటిల కాంబినేషన్‌లో ‘ప్రేమం’ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించడం ఆనందంగా ఉంది. ఈ నెలలోనే చిత్రం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. డిసెంబర్ నెలలో సినిమా రెగ్యులర్ షూటింగ్ విశాఖలో ప్రారంభమవుతుంది. సమ్మర్ స్పెషల్‌గా చిత్రం విడుదలయ్యే దిశగా నిర్మాణ కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోంది. ‘ప్రేమం’ ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ. ప్రేమతో కూడిన సంగీత భరిత వినోద దృశ్య కావ్యమిది. నాగచైతన్య సరసన శృతిహాసన్‌తో పాటు మరో ఇద్దరు కథానాయికలు కూడా నటిస్తున్నారు. వారిలో ఒకరు అనుపమ పరమేశ్వరన్ కాగా మరో కథానాయిక ఎంపిక కావాల్సి ఉంది”అని తెలిపారు. దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ “ప్రేమం చిత్రా న్ని తెలుగులో రూపొందించ డమన్నది ఎంతో బాధ్య తతో కూడి నది. తెలుగులోనూ ఈ చిత్రం మంచి విజయం సాధించేలా రూపకల్పన చేస్తున్నాం’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతంః రాజే ష్ మురుగేషన్, గోపీసుందర్, ఛాయాగ్రహణంః కార్తీక్ ఘట్టమ నేని, ఎడిటింగ్‌ః కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌ః సాహి సురేష్, ఒరిజినల్ స్టోరీః ఆల్ఫోన్సె పుధరిన్, సమర్పణః పిడివి ప్రసాద్.

Comments

comments