Home సినిమా నాగచైతన్య-త్రివిక్రమ్ మూవీ ఓకే

నాగచైతన్య-త్రివిక్రమ్ మూవీ ఓకే

Naga-Chaitanya

అక్కినేని నాగచైతన్య, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందనే మాట కొన్ని నెలలుగా వినిపిస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు అంతా ఒకే అయినట్లు తెలిసింది. నాగచైతన్యతో త్రివిక్రమ్ మూవీ ఇప్పుడు ఖాయమైందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ సెట్ కావడంలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించినట్లు టాక్. ఈ ప్రాజెక్ట్‌ను స్వయంగా తనే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించనున్నాడట. ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్ పూర్తికాగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ఏడాది చివరలో ఈ సినిమాను ప్రారంభించాలని నాగార్జున భావిస్తున్నాడట. ఇక ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు త్రివిక్రమ్. ఇది వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉండగా అక్టోబర్‌నాటికి ఈ సినిమా పూర్తయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కళ్యాణ్‌కృష్ణ మూవీతో బిజీగా ఉన్నాడు నాగచతైన్య. దీని తర్వాత అతను కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. ఇటు చైతూ అటు త్రివిక్రమ్ ఇద్దరూ దాదాపుగా ఒకే సమయానికి ఫ్రీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అనంతరం ఈ ఏడాది చివరకు ఈ కొత్త సినిమా రెగ్యులర్
షూటింగ్ ప్రారంభమవుతుంది.