Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

రొమాంటిక్ యాంగిల్‌లో నాగచైతన్య

nagachaitanya

ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో వంటి రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఉంది. నాగార్జునకు ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి క్లాసికల్ హిట్‌నిచ్చిన ఈ దర్శకుడు నాగచైతన్యను కూడా పూర్తిగా రొమాంటిక్ యాంగిల్‌లో చూపించనున్నాడు. ఈ చిత్రంలో చైతన్య పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్, న్యూ లుక్‌లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఈనెల 29న ఉగాది సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా… ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు ఫిల్మ్‌మేకర్స్.

Comments

comments