Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

గే పాత్రలో నటించా

NagaShaurya

‘ఛలో’ సినిమాతో సూపర్‌హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా  చిత్రం ‘నర్తనశాల’. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌లో శంకరప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన చిత్రమిది. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో నాగశౌర్యతో ఇంటర్వూ విశేషాలు… 

చిన్న సందేశంతో…

సినిమాలో నేను గే పాత్రలో నటించాను. ఇద్దరు అమ్మాయిలు అతన్ని లవ్ చేస్తే ఎలా ఉంటుందనేదే కథ. ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలతో పాటు చిన్న సందేశం కూడా ఉంటుంది.

కథకు తగ్గట్టుగా టైటిల్…

డిఫరెంట్‌గా ఉండే కథతో సినిమా తెరకెక్కింది. క్లాసిక్ మూవీ ‘నర్తనశాల’లో బృహన్నల పాత్రలాగా ఇందులో గే పాత్ర ఉండడంతో సినిమాకు అదే టైటిల్ సరిపోతుందని పెట్టడం జరిగింది. ‘నర్తనశాల’ టైటిల్ ఈ కథకు సరిగ్గా సరిపోతుంది.

వాళ్ల కష్టాలు తెలుసుకుంటా…

మహిళా సాధికారికత కోసం వారిని ప్రోత్సహించే పాత్రలో నటించాను. వాళ్ల కష్టాల గురించి తెలుసుకుంటాను. ఈ సినిమాలో నా పాత్రతో పాటు అజయ్, శివాజీరాజా, జయప్రకాష్ రెడ్డిలది ముఖ్యమైన పాత్రలు.

అద్భుతంగా తెరకెక్కించాడు…

శ్రీనివాస్ చక్రవర్తి కొత్త దర్శకుడు అయినప్పటికీ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. అతను చాలా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ సినిమా తర్వాత అతను ఇండస్ట్రీలో బిజీ అయిపోతాడు.

రెండింటికీ మంచిదే…

మా చిత్రంతో పాటు ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా కూడా వస్తుందనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల అది రావడం లేదు. అయితే రెండు సినిమాలు వేర్వేరుగా విడుదలవుతుండడంతో రెండింటికీ మంచిదే. రెండు చిత్రాల మధ్య రెండు వారాల గ్యాప్ వస్తోంది. దాని వల్ల రెండు చిత్రాలకు మంచి జరుగుతుంది.

మల్టీస్టారర్ చేయను…

గతంలో నారా రోహిత్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ చేశాను కానీ ఇప్పట్లో మళ్లీ అలాంటి సినిమా చేయను. రోహిత్ నాకు బాగా తెలుసు కాబట్టి ఆ సినిమా చేశాను. ప్రస్తుతానికైతే మల్టీస్టారర్ చేయాలన్న ఆలోచన లేదు.

తదుపరి చిత్రాలు…

రమణ తేజ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాను. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రానికి కూడా మహితి సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది కాకుండా మరో రెండు చిత్రాలను ఓకే చేశాను.

Comments

comments