Home సినిమా కొత్త దర్శకుడితో ‘నర్తనశాల’

కొత్త దర్శకుడితో ‘నర్తనశాల’

nags

ఐరా క్రియేషన్స్ సంస్థలో ఇటీవల వచ్చిన ‘ఛలో’ సినిమా ఘన విజయం సాధించింది. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. సాగర్ మహతి సంగీతాన్ని అందించిన పాటలు మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఇదే బ్యానర్‌లో నాగశౌర్య రెండో సినిమా మొదలుపెట్టబోతున్నాడు. శ్రీనివాస్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. శ్రీనివాస్ గతంలో కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ‘నర్తనశాల’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. త్వరలో ప్రారంభంకానున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక నాగశౌర్య తాజాగా నటించిన ‘అమ్మమ్మగారిల్లు’ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ చిత్రం తర్వాత శ్రీనివాస్ సినిమా మొదలుకానుంది.