Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

‘సవ్యసాచి’గా నాగచైతన్య

Naga-Chaitanya

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నం.4కు ‘సవ్యసాచి’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రీలుక్ పోస్టర్, టైటిట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ “చందు మొండేటి రాసిన సూపర్బ్ హీరో క్యారెక్టరైజేషన్‌కు ‘సవ్యసాచి’ అనేది సరైన టైటిల్. ప్రేమమ్ వంటి సెన్సేషనల్ హిట్ అనంతరం అక్కినేని నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే స్థాయిలో సినిమా ఉంటుంది. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలవనున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం”అని అన్నారు.

Comments

comments