Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

నాగచైతన్య పెళ్లి కొడుకాయెనే…

Nag

టాలీవుడ్ ప్రేమ జంట అక్కినేని నాగచైతన్య, సమంతలు వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. తొలుత ఈ ప్రేమికులు హిందూ సంప్రదాయంలో మూడు ముళ్లతో ఒక్కటైతే.. క్రిస్టియన్ సంప్రదాయంలో రెండు ఉంగరాలతో వివాహ బంధంతో దగ్గరవుతున్నారు. గోవాలో ఈ పెళ్లి వేడుకను అంగ రంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వరుడు నాగచైతన్యను పెళ్లి కొడుకును చేసిన ఫొటోను నాగార్జున ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. చూస్తుండగానే మేనల్లుడు ఎంత పెద్దవాడైపోయాడు… కంగ్రాట్స్ చై… అంటూ వెంకటేష్ తన ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు. నాగచైతన్యలో పెళ్లికళ ఉట్టిపడుతోంది. పెళ్లి కూతురిగా సమంత లుక్ ఎలా ఉండబోతోందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వివాహానికి నెల రోజుల ముందు నుంచే వెడ్డింగ్ ఫొటో షూట్ తీయించి ఫొటోలు పోస్ట్ చేసింది సమంత.
కొత్త కోడలితో...
పెళ్లి సంబరంలో నాగచైతన్యలో పెళ్లి కళ ఉట్టిపడుతుంటే… మరోపక్క వధువు సమంత ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అయితే తనకు కాబోయే కోడలు సమంతతో తీసుకున్న ఫొటోను తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు పోస్ట్ చేశాడు నాగార్జున. లొకేషన్ ఎక్కడన్న విషయం పక్కనపెడితే కొద్ది గంటల్లో సమంత మా కోడలు కాబోతోందని ట్వీట్ చేశాడు ఈ సీనియర్ స్టార్. ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది ఈ ఫొటో.

Comments

comments