Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

రొమాంటిక్ కెమిస్ట్రీ అదిరింది

Nagachaitanya in Sailareddy Alludu

అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ప్రేక్షకులు, అభిమానుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే టీజర్, ప్రోమోస్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఒక మెలోడి సాంగ్ వీడియో ప్రోమో రిలీజైంది. ‘ఎగిరెగిరే…’ అంటూ సాగే ఈ మెలోడీని గోవాలోని అందమైన బీచ్‌లతో పాటుగా ఇతర అందమైన లొకేషన్స్‌లో తెరకెక్కించారు. ఈ పాటలో నాగచైతన్య, అను ఇమ్యాన్యుయల్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ అదిరిపోయింది. సిడ్ శ్రీరామ్, లిప్సిక ఈ పాటను పాడారు. గోపిసుందర్ మెలోడి ట్యూన్‌కు శ్రీరామ్ గొంతు సరిగ్గా సరిపోయి సంగీత ప్రియులను అలరిస్తోంది ఈ పాట. ఈ సినిమాలో చైతన్యకు అత్త పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. ఒకవైపు పవర్‌ఫుల్ అత్త మరోవైపు ఈగోతో చంపే ఆమె కూతురు అను ఇమ్మాన్యుయల్ మధ్య చైతూ పరిస్థితి ఎలా ఉంటుందో సినిమాలో చూడాల్సిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈనెల 31న విడుదలకు సిద్ధమవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Comments

comments