Search
Saturday 17 November 2018
  • :
  • :

నాగచైతన్య-మారుతిల కొత్త చిత్రం షురూ

chai

అక్కినేని నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో లో శనివారం ఉదయం ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు ఫిల్మ్‌మేకర్స్.  సితార ఎం టర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నం.3గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. నాగచైతన్య సరసన అను ఇమాన్యుయల్ నాయికగా నటించనుంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ “జనవరి 5 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం”అని అన్నారు.

Comments

comments