Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నాగచైతన్యతో శ్రీను వైట్ల సినిమా?

chaituఅక్కినేని నాగచైతన్య ఇప్పుడు మంచి ఊపులో ఉన్నాడు. ‘ప్రేమమ్’ విడుద ల కాకముందే అతను కొత్తగా మూడు సిని మాల దాకా కమిటయ్యాడు. ఇక ‘ప్రేమమ్’ సూపర్ హిట్ అయ్యేసరికి చైతూలో మరింత ఊపొచ్చింది. అతని కోసం చాలా మంది దర్శ కులు లైన్‌లోకి వచ్చేశారు. వారిలో శ్రీనువైట్ల కూ డా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌తో ‘మిస్టర్’ సినిమా ను తెరకెక్కిస్తున్న వైట్ల… తన నెక్స్ మూవీని చైతూతోనే చేయాలనుకుంటున్నా డట. ఈమధ్యే నాగార్జునకు కథ చెప్పి ఓకే చేయిం చుకున్నాడు శ్రీనువైట్ల. ఆయన నాగ్‌తో ఇంత కుముందు ‘కింగ్’ వంటి హిట్ మూవీ తీశాడు. ఆత ర్వాత అక్కినేని అఖిల్‌తో సినిమా చేయవచ్చనే ప్రచారం జరిగింది కానీ… అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు స్క్రిప్ట్ నచ్చి చైతన్య సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాగార్జున ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తారని సమాచారం. త్వరలోనే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టనున్న నాగచైతన్య… ఆతర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాకు పనిచేస్తాడు. వీటితో పాటు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కృష్ణ అనే యువ దర్శకుడితో ఓ సినిమా చేస్తాడు.

Comments

comments