Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నాగచైతన్య హీరోగా సినిమా షురూ

nagachaitanyaనాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి వారాహి చలన చిత్రం నిర్మిస్తున్న చిత్రం ప్రారంభోత్సవం కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. కృష్ణ ఆర్.వి.మరిముతు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘పెళ్లి చూపులు’ ఫేం వివేక్ సాగర్ సంగీత సారధ్యం వహించనుండగా… శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. వారాహి చలన చిత్రం కార్యాలయంలో లాంఛనంగా జరిగిన ఈ ప్రారంభ వేడుకకు సురేష్‌బాబు, ఎస్.ఎస్.రాజమౌళి, కీరవాణి, విజయేంద్రప్రసాద్, శ్రీకాంత్, గుణ్ణం గంగరాజు, దేవినేని ప్రసాద్, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి గుణ్ణం గంగరాజు క్లాప్ కొట్టగా… ఎం.ఎం.కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. సురేష్‌బాబు, దేవినేని ప్రసాద్‌లు కలిసి స్క్రిప్ట్‌ను దర్శకుడు కృష్ణ ఆర్.వి.మరిముతుకు అందించారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ “సురేష్‌బాబుతో కలిసి వారాహి చలన చిత్రం బ్యానర్‌లో నాగచైతన్య హీరోగా సినిమా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించే ఈ చిత్రంలో శ్రీకాంత్, రావు రమేష్‌లు కీలక పాత్రలు పోషించనున్నారు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది”అని అన్నారు. ఈ చిత్రానికి సమర్పణః సాయి శివాణి, కథః డేవిడ్ ఆర్.నాథన్, మాటలుః అబ్బూరి రవి, స్క్రీన్‌ప్లేః డేవిడ్ ఆర్.నాథన్, అబ్బూరి రవి, కళః రామకృష్ణ, సినిమాటోగ్రఫీః నికేత్ బొమ్మి, సంగీతంః వివేక్ సాగర్.

Comments

comments