Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ : నాగం జనార్దన్‌రెడ్డి

Nagam Janrdhan Reddy Speech About Kaleshwaram Project

నాగర్ కర్నూలు : ఆదివారం నాడు  విలేకరులతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావుపై  తీవ్రస్థాయి ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు కట్టిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిది కాదని ఆయన అన్నారు. ఈ విషయంలో మంత్రి హరీశ్‌ రావు అన్ని అబద్ధాలే చెప్తున్నారని ఆయన  విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిని తాను బయటకు తీస్తున్నానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రాజెక్టు కోసం నాసిరకం పంపులు, మోటార్లు వాడుతున్నారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన దోపిడీ జరుగుతోందని ఆయన తెలిపారు.

Comments

comments