Search
Wednesday 14 November 2018
  • :
  • :

యువతకు నచ్చే ‘దేవదాసు’

Nagarjun And Nani Multistarer Movie In Tollywood

నాగార్జున, నాని మల్టీస్టారర్ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకు ‘దేవదాసు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.  నేటి యువతకు నచ్చే విధంగా సినిమా ఉండబోతోంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్ర నిర్మాణం చివరి దశలో ఉంది. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సి.ధర్మరాజు సమర్పణలో అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. సీనియర్ నరేష్, రావు రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌ః శందత్ సైనుద్దీన్, మ్యూజిక్‌ః మణిశర్మ, ఆర్ట్‌ః సాహి సురేష్, డైలాగ్స్‌ః వెంకట్, కొరియోగ్రఫీః బృంద, ప్రేమ్ రక్షిత్, శేఖర్ మాస్టర్.

Comments

comments