Home గాసిప్స్ త్వరలో తండ్రీకొడుకుల కొత్త మూవీ..!?

త్వరలో తండ్రీకొడుకుల కొత్త మూవీ..!?

Nagarjuna and Naga chaitanya to act in new movie

కింగ్ నాగార్జున, నాగ చైతన్య కాంబోలో మరో మూవీ రాబోతుందట. త్వరలోనే తండ్రీ కొడుకులు కలిసి ఓ మూవీ లో నటించనున్నారట. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో పేద్ద టాక్.

శతమానం భవతి సినిమాతో సక్సెస్ కొట్టిన డైరెక్టర్ సతీశ్ వేగెశ్న వీళ్ల కాంబో మూవీకి దర్శకత్వం వహించనున్నాడట. దిల్ రాజు ఈ మూవీ కి ప్రొడ్యూసరట.

ప్రస్తుతానికి నాగార్జున ఓం నమో వేంకటేశాయ మూవీ షూటింగ్ లో బిజీగా ఉండగా…చైతు.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయ్యాక.. వీళ్ల కాంబో మూవీ పట్టాలకెక్కనుందట.

ఇక, ‘మనం’ తర్వాత మళ్లీ తండ్రీకొడుకుల కాంబోలో మూవీ వస్తుందనడంతో అక్కినేని అభిమానుల్లో అప్పుడే సందడి నెలకొందట. వీళ్ల కాంబోలో వచ్చే మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయం అంటూ అక్కినేని అభిమానులు అంటున్నారట.