Home సినిమా పారు ఉంటుందనుకుంటే… దాస్ ఫెలో ఉన్నాడు!

పారు ఉంటుందనుకుంటే… దాస్ ఫెలో ఉన్నాడు!

Nagarjuna and  Nani Devadas first look released

నాగార్జున, నాని హీరోలుగా నటిస్తున్న ‘దేవదాసు’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. ఈ ఏడాది రానున్న క్రేజీ మల్టీస్టారర్స్‌లో ఈ సినిమా ముందు వరుసలో ఉంది. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లో నాగార్జున కు జోడీగా ఆకాంక్షసింగ్… నానీ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వైజయంతి మూవీస్ సంస్థపై అశ్వనీదత్ నిర్మాతగా… సి.ధర్మరాజు సమర్పణలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఫస్ట్‌లుక్ విడుదలైన సందర్భంగా నాగార్జున, నాని ఇద్దరూ ట్విట్టర్‌లో ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. “నా పక్కన పారు ఉంటుందనుకుంటే… దాస్ ఫెలో ఉన్నాడు”అంటూ నాగ్ కామెంట్ చేశాడు. నాని అయితే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయాడు. “1996లో నాగార్జున సార్ నటించిన ‘నిన్నే  పెళ్లాడతా’ విడుదలైంది. నాగ్ సార్ స్క్రీన్‌పైన… నేనేమో దేవి థియేటర్ బయట క్యూలో ఉన్నాను. 2018లో ‘దేవదాస్’. నాగార్జున, నేను కలిసి ఫస్ట్‌లుక్‌లో…”అంటూ తన ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. నరేష్, బాహుబలి ప్రభాకర్, రావు రమేష్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతంః మణిశర్మ, మాటలుః వెంకట్, కొరియోగ్రఫీః బృందా, ప్రేమ్ రక్షిత్, శేఖర్ మాస్టర్.