Search
Monday 24 September 2018
  • :
  • :

పజిల్‌లా ఎన్నో మలుపులు

U-Turn

సమంత ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘యు టర్న్’. పవన్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున మాట్లాడుతూ “క్రౌడ్ ఫండెడ్ మూవీగా దర్శకుడు పవన్ తీసిన ‘లూసియా’ మంచి హిట్ అయింది. ఇప్పుడు ‘యు టర్న్’తో అతను మరో హిట్ కొట్టబోతున్నా డు. సినిమా ట్రైలర్ చూశాను… చాలా బాగుంది. సమంత సినిమా స్టోరీ చెప్పేటప్పుడు ఎంతో థ్రిల్‌గా ఫీల్ అయ్యాను. ఒక సంఘటనతో మొదలయ్యే సినిమా మొత్తం పజిల్‌లా ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. సమంత మాట్లాడుతూ “నన్ను నమ్మి  ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు చాలా థాంక్స్. చిన్న సినిమానే అయినా ఒక పెద్ద సినిమా లుక్‌ను తీసుకువచ్చారు. ట్రైలర్స్, సాంగ్‌కు వచ్చిన స్పందన చూస్తుంటే సినిమా కూడా హిట్ అనిపిస్తోంది”అని తెలిపారు. దర్శకుడు పవన్ మాట్లాడుతూ “సమంత ఈ సినిమాలో చాలా బాగా చేశారు. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది”అని చెప్పారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ “పవన్‌కుమార్ చేసిన ‘లూసియా’ చూసి ఆయనతో ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. ‘యు టర్న్’తో ఆ కోరిక తీరింది. ఇప్పుడు వస్తున్న వెరైటీ సినిమాల్లో ఇది టాప్ అని చెప్పొచ్చు. సమంత ఈ చిత్రం కోసం చాలా కష్టపడింది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాహుల్ రవీంద్రన్, శ్రీనివాస్ చిట్టూరి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments