Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

పుట్టిన రోజు కానుకగా…

Nagarjuna

అక్కినేని నాగార్జున, నాని నటిస్తున్న ‘దేవదాస్’ టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఫస్ట్‌లుక్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు నాగార్జున సోలో లుక్‌ను విడుదల చేయబోతున్నారు. బుధవారం ఆయన పుట్టిన రోజు కానుకగా ఈ లుక్‌ను విడుదల చేయనున్నారు. నాగార్జున ఈ చిత్రంలో దేవా పాత్రలో నటిస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుం ది. నరేష్, బాహుబలి ప్రభాకర్, రావు రమేష్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ః శ్యామ్‌దత్ సైనూద్దీన్, ఆర్ట్‌ః సాహి సురేష్.

Comments

comments