Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రావణుడి పాత్రలో నటించాలనుంది!

Nagarjuna-pathటాలీవుడ్‌లో ఆల్‌టైం రికార్డులను సృష్టించిన ‘బాహుబలి’ సినిమా వచ్చాక అందరు స్టార్ హీరోలు చారిత్రాత్మక, పీరియడ్ ఫిల్మ్ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నా రు. తాజాగా సీనియర్ స్టార్ హీరో నాగార్జున కూడా ‘బాహబలి’ లాంటి పీరియడ్ ఫిల్మ్‌లో చేయాలనుందని చెప్పాడు. తనకి రామాయణంలో మెయిన్ విలన్ అయిన రావణుడిగా నటించాలనేది తన కోరిక అని అన్నాడు. నాగార్జున మాట్లాడుతూ “నా చిన్నప్పటి నుంచి ఎన్నో పౌరాణిక, జానపద కథలను వింటూ పెరిగాను. వీటితో పాటు ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్‌లు చేసిన పౌరాణిక సినిమాలను ఎక్కువగా చేశాను. అందుకే అలాంటి సినిమాల్లో నటించాలనుంది. ‘బాహుబలి’ సిని మాలో నేను నటించలేకపో యినం దుకు బాగా ఫీలయ్యాను. అలాగే ఆ సినిమాలో నటించిన నటీనటు లపై ఈర్ష కూడా కలిగింది” అని తెలిపాడు. నాగార్జున కథానాయకుడిగా చేసిన ‘సోగ్గాడే చిన్నినా యనా’ సిని మా షూటింగ్ పూర్తయ్యిం ది. కార్తీ, తమన్నాలతో కలిసి చేస్తున్న ద్విభాషా చిత్రం షూటింగ్‌లో ఆయన పాల్గొంటున్నాడు.

Comments

comments