Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ధనుష్ దర్శకత్వంలో…

Nag

నాగార్జున ప్రస్తుతం నానీతో కలిసి ‘దేవదాస్’ అనే మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. ‘భలే మంచి రోజు’ చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఈనెలలో షూటింగ్ పూర్తిచేసి సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంతో పాటు నాగార్జున హిందీలో అమితాబ్‌బచ్చన్, రణబీర్‌కపూర్‌లతో కలిసి ‘బ్రహ్మాస్త్ర’ అనే చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడు. ఇక ప్రస్తుతానికి నాగార్జున చేతిలో ఈ రెండు చిత్రాలు తప్ప వేరే కొత్త సినిమాలు లేవు. ఇక ఇప్పుడు నాగార్జున కోలీవుడ్‌లో ధనుష్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. వీరిద్దరూ కలిసి సినిమా చేయనున్నారని గతంలో కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు నాగార్జున ఈ వార్తలను త్వరలోనే నిజం చేయనున్నాడు.

Comments

comments